తెలుగు సినిమా రంగానికి నందమూరి అక్కినేని కుటుంబాలు రెండు రెండు మూల స్తంభాలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోలు ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత ఇప్పుడు మూడో తరంలోనూ హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత వీరిద్దరి వారసులుగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా యువరత్న నందమూరి బాలకృష్ణ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున మూడు దశాబ్దాలుగా వెండితెర రారాజుగా కొనసాగారు. ఇక ఇప్పుడు ఈ రెండు కుటుంబాల నుంచి మూడో తరం వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు.

 

నందమూరి కుటుంబంలో మూడో తరం లోనూ ఎన్టీఆర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసులు ఎవరు ఆ కుటుంబ అభిమానుల ఆశలను నెరవేరుస్తుందని అన్న ప్రశ్నకు కచ్చితంగా అక్కినేని నాగచైతన్య మాత్రమే ఆ కుటుంబ అభిమానుల ఆశలను నిలబెడుతున్నారు అని చెప్పాలి. వాస్తవానికి నాగేశ్వరరావు కుమార్తె తనయుడు యార్లగడ్డ సుమంత్ సైతం హీరో గా ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ నిలదొక్కుకోలేక పోయాడు. ఇక భారీ అంచనాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

 

నాగ చైతన్య జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండో సినిమామాయ చేశావే తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంత తన జీవిత సహధర్మచారిణి గా చేసుకున్నాడు. ఇక పెళ్లయ్యాక కూడా వీరిద్దరూ కలిసి నటించిన మజిలీ సినిమా సైతం సూపర్ డూపర్ హిట్ అయింది. కెరీర్ పరంగా మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సరైన టైంలో సరైన హిట్ సినిమాలు పడటంతో ఈరోజు అక్కినేని కుటుంబంలో మూడో తరం ఆశలను నిలబెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: