మలయాళ బ్యూటీ  మాళవిక మోహనన్ ఈమధ్య  వరసగా  హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియా లో తెగ హడావిడి చేస్తుంది. అందులో భాగంగా తాజాగా మాళవిక.. బీచ్ లో హాట్ గా ఫోటోలకు ఫోజిలివ్వగా ఆఫోటోలు ప్రస్తుతం  సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ఈ సమ్మర్ ను తన అందం తో మరింత హాట్ గా మారుస్తుందని కామెంట్లు పెడుతున్నారు.
 
ఇదిలావుంటే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేటతో  కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ కు ఈసినిమా తరువాత టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో 'హీరో' లో హీరోయిన్ గా నటించే ఆఫర్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రం ఓ షెడ్యూల్ ను కూడా  పూర్తి చేసుకుంది అయితే ఆ షెడ్యూల్ అనుకున్న విధంగా రాకపోకడవంతో నిర్మాతలు సినిమాను ఆపేశారు దాంతో హీరోతో తెలుగు లో ఎంట్రీ ఇద్దామనుకున్న మాళవిక ఆశలు నెరవేరలేదు ఆ సమయంలో హాట్ ఫోటో షూట్ లతో పాల్గొంటూ మేకర్స్ దృష్టిలో పడ్డ  మాళవిక కు ఏకంగా  రెండో సినిమా తో భారీ ఆఫర్ వచ్చింది.
 
కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ లో ఆయనకు జోడిగా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. మరి ఈ సినిమా మాళవికకు బ్రేక్ ఇస్తుందో చూడాలి. కాగా మాస్టర్  తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది. దాంతో ఈ సినిమా ద్వారా మాళవిక కు తెలుగులోనూ ఆఫర్లు వచ్చే ఛాన్స్ వుంది. ప్రస్తుతానికైతే  మాళవిక, మాస్టర్ తరువాత మరో సినిమా కు సైన్ చేయలేదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: