సినిమాలను డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించడంలో కూడా సుకుమార్ ప్యాషన్ కనిపిస్తుంది. కుమారి 21ఎఫ్ సినిమాతో నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకున్న సుకుమార్ అదే డైరక్టర్ తో మరో సినిమా చేస్తున్నాడు. సూర్య ప్రతాప్ డైరక్షన్ లో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళింది. ఇక ఈ సినిమాకు సంబందించిన కథ లీక్ అయినట్టు తెలుస్తుంది. 

 

ఈ సినిమాలో హీరోయిన్ కు మెమొరీ లాస్ అవుతుందట. అలాంటి టైం లో హీరోయిన్ డైరీ మెయింటైన్ చేస్తుందట. అయితే అలా రాసుకున్న డైరీ మిస్ అవడం అది కాస్త హీరోకి దొరకడం జరుగుతుందట. అలా దొరికిన డైరీలోని అమ్మాయిని గుర్తించి ఆమెకు దగ్గరవుతాడట హీరో. ఇదే కథతో 18 పేజెస్ మూవీ వస్తుందట. నిఖిల్ చాలా కాలం తర్వాత చేస్తున్న లవ్ స్టోరీ ఇది చెప్పొచ్చు. నిఖిల్ లవ్ స్టోరీలు చేసి చాలా రోజులు  అవుతుంది. అర్జున్ సురవరం తర్వాత నిఖిల్ ఒకేసారి రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి కార్తికేయ 2 కాగా మరోటి 18 పేజెస్ మూవీ.

 

ఈ రెండు సినిమాలతో మళ్ళీ తాను ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు నిఖిల్. 18 పేజెస్ లీక్ అయినా కథ నిజంగా సినిమా కథ అయితే మాత్రం మూవీ హిట్ అయినట్టే. ఈ సినిమా కోసం నిఖిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఉప్పెన సినిమా కూడా సుకుమార్ ఒక నిర్మాతగా ఉన్నారు. నిఖిల్ చేస్తున్న ఈ రెండు ప్రాజెక్టులు చాలా క్రేజీగా మారనున్నాయి. ఈ సినిమాల్లో ఒక్కటి హిట్టయినా సరే నిఖిల్ రేంజ్ మారిపోతుంది. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు కూడా ఈ ఇయర్ లో రిలీజ్ అయ్యేలా ప్లాం చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: