బాలీవుడ్ అందాల రాణి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన అందాల ప్రదర్శన ఇవ్వడంలో నెంబర్ వన్.  కుర్రాళ్ల మతులు పోగొట్టేలా పిక్కల వరకు షార్ట్ డ్రెస్సులు వేసుకుంటా ఈ పొడుగు భామ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది.  మోడలింగ్ రంగంలో ఉంటూ ఎన్నో హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొని బాలీవుడ్ దర్శక, నిర్మాతలను మెప్పించింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.  శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది.

 

 2011లో ఈ బ్యూటీ నటించిన మర్డర్2 మంచి హిట్ అయ్యింది.  ఆ తర్వాత హౌస్ ఫుల్, రేస్ మూవీస్ తో మంచి విజయం అందుకుంది.  హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది.  తర్వాత తెలుగులో హిట్ అయిన కిక్ మూవీ బాలీవుడ్ రిమేక్ లో సల్మాన్ ఖాన్ నటించాడు.  ఆయన సరసన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించి మెప్పించింది.  ఆ తర్వాత బాలీవుడ్ లో  హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ మూవీస్ తో మంచి విజయాలు అందుకుంది.  

 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త‌న ఫిట్‌నెస్ సీక్రెట్స్ చెప్పింది.  త‌న బాడీ షేప్‌ను ఎలా మెయింటేన్ చేస్తోందో కొన్ని వీడియోస్ పోస్టు చేసింది.  యోగాతో త‌న బాడీని ఫిట్‌గా ఎలా ఉంచుకుంటోందో ఆ వీడియోల్లో ప్ర‌జెంట్ చేసిందా బ్యూటీ. పింక్ ఫ్రాక్‌లో హాట్‌గా క‌నిపిస్తున్న జాక్వెలిన్‌.. యోగాస‌నాల‌తో అట్రాక్ట్ చేస్తోంది. భ‌జంగాస‌నంతో వెన్నుపూస‌ను ఎలా ఆరోగ్యం ఉంచ‌వ‌చ్చో ఆ ఆస‌నాన్ని వేసి చూపించింది. రిలాక్స్ అయ్యే మ్యూజిక్‌తో ఇలాంటి ఆస‌నం వెయ్యాల‌ని కూడా జాకీ ఓ స‌జెష‌న్ ఇచ్చింది.  ఫెర్నేండ‌జ్ వీడియోల‌ను చూస్తున్న ఆమె అభిమానులు కామెంట్ల‌తో రెచ్చిపోతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Stretch 💖 keep that spine healthy and happy! yoga poses are my fav, anytime, anywhere!

A post shared by jacqueline Fernandez (@jacquelinef143) on

మరింత సమాచారం తెలుసుకోండి: