సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో బయోపిక్ ల హవా ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖుల బయోపిక్ తీసేందుకు దర్శక నిర్మాతలందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు . అటు అభిమానులు కూడా బయోపిక్ లోనూ బాగా ఆదరిస్తుండటంతో  దర్శక నిర్మాతలు మరింతగా బయోపిక్ లని తెరకెక్కించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో అటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బయోపిక్ ల హవా నడుస్తోంది.

 

 

ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ బయోపిక్ ల మేనియా ఎక్కువగా ఉంది అనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ లు  ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లోని తెరకెక్కిస్తున్నారు దర్శకులు . నిజజీవితానికి దగ్గరగా ఉండే కథ కావడం కొత్తగా కథ రాసుకునే అవసరం లేకపోవడంతో దర్శక నిర్మాతలు మరింతగా బయోపిక్ ల పై ఆసక్తి చూపుతున్నారు. 

 

 

 ఇప్పుడు వరకు మేరీ కోమ్,  ఎంఎస్  ధోనిసచిన్ లాంటి క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు బయోపిక్ లు  తెరకెక్కించారు. ఇక ఇప్పుడు  ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత చరిత్రను కూడా తెరకెక్కించేందుకు  ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. అయితే యువరాజ్  బయోపిక్ తెరకెక్కబోతుంది అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన యువరాజ్... తన పాత్రలో ఏ నటుడయితే  బాగుంటాడో  చెప్పుకొచ్చాడు.  సినిమాలో తన పాత్రలో  తానే నటించాలని ఉంది అంటూ యువరాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 

 

కానీ అది సాధ్యం కాకపోవచ్చని.. నటుడిని నిర్ణయించే అధికారం మాత్రం డైరెక్టర్ కు  ఉంటుంది అంటూ  తెలిపాడు. అయితే తన బాలీవుడ్ లో తన పాత్రలో సిద్ధాంత్ చతుర్వేది అయితే బాగా సెట్ అవుతాడు అంటూ  తెలిపాడు. తన పాత్రలో సిద్దాంత్ చతుర్వేది ని  చూసేందుకు ఇష్టపడుతారు అంటూ పేర్కొన్నారు. చూడాలి మరి యువరాజు బయోపిక్ లో ఎవరు నటిస్తారో  అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: