మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఆయన చేత మాస్ మూవీస్ మాత్రమే చేయించాయి. దీంతో ఎంతో మాస్ ఇమేజ్ సంపాదించారు. ప్రేక్షకులు ఎప్పుడూ బోర్ ఫీల్ కాలేదు.. చిరంజీవి బోర్ కొట్టించలేదు. కెరీర్ తొలినాళ్లలో లవ్ సబ్జెక్ట్ ను కొన్ని సినిమాల్లో టచ్ చేశారు. న్యాయం కావాలిలో కొంతసేపు లవర్ బాయ్ గా కనిపించినా తర్వాత భాగం సినిమా అంతా ఎమోషనల్ సబ్జెక్ట్ లోకి వెళ్లిపోతుంది. కానీ మాస్ హీరోగా ఇమేజ్ సంపాదించాక కూడా ఆయన లవర్ బాయ్ గా నటించారు.

 

 

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై చిరంజీవి 1998లో చేసిన చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి అయిదు నిమిషాల పాటు లవర్ బాయ్ క్యారెక్టర్ చేశారు. రైల్వే స్టేషన్ లో అంజలా ఝవేరిని చూసినప్పుడు అక్కడే స్టేషన్ లోనే తనతో లవ్ లో పడే సీన్ లో మెగాస్టార్ నటించారు. అప్పటికి చిరంజీవి వయసు 43 ఏళ్లు. మెగా మాస్ ఇమేజ్ ఆయన సొంతం. కానీ చిరంజీవితో ఆ షాట్ చేయించాడు దర్శకుడు గుణశేఖర్. మొదట ఈ సీన్ పై చిరంజీవి డౌట్ వ్యక్తం చేసినా సినిమాకు కీలకమైన ఘట్టం కావడంతో తనదైన స్టైల్ లో లవర్ బాయ్ గా చిరంజీవి యాక్ట్ చేశారు.

 

 

చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్, ఫీల్, చిరునవ్వుతో మెస్మరైజ్ చేసి ప్రేక్షకులకు బోర్ కొట్టించనంతగా ఆ సీన్ ను పండించారు మెగాస్టార్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లో ఆ సీన్ కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్, గుణశేఖర్ టేకింగ్, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఆ సీన్ కు ప్రాణం పోశాయి. ఇప్పటికీ ఆ సీన్ చూస్తే ఏమాత్రం మొనాటనీ అనిపించదు. అంతగా ఆ సీన్ రక్తి కట్టిందని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: