టాలీవుడ్ లో అడుగు పెట్టిన తక్కువ కాలంలో... మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్. అతని సినిమాలు వస్తున్నాయి అంటే 2000 నుంచి 2005 వరకు కూడా అమ్మాయిలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వారు. ముఖ్యంగా అతని గ్లామర్ అమ్మాయిలకు బాగా దగ్గరయ్యేలా చేసింది. ఇక ఆంటీ లు కూడా అతన్ని పక్కింటి అబ్బాయి అంటూ కామె౦ట్ చేసే వారు అప్పట్లో. ఆ విధంగా తరుణ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను చేసిన సినిమాలు తక్కువే అయినా అమ్మాయిలకు మాత్రం రాకుమారుడు అయ్యాడు అనే చెప్పాలి. 

 

టాలీవుడ్ లో తరుణ్ ఊపు చూసి అతను స్టార్ హీరో అవుతాడు అనుకున్నారు అప్పట్లో. కాని ఏమైందో ఏమో కెరీర్ లో ఒక్కసారిగా పడిపోయాడు. అతనికి వచ్చిన అవకాశాలను వాడుకోలేదో మరేదో కారణమో తెలియదు గాని అతని కెరీర్ మాత్రం ఊహించని విధంగా పడిపోయింది. కాలేజీ అమ్మాయిలకు అతను డ్రీం బాయ్ అయ్యాడు అప్పట్లో. ఆ విధంగా తన ముద్ర వేసాడు. ఆ తర్వాత ఒకటి రెండు ప్రేమ వ్యవహారాలు అతని కెరీర్ ని ఇబ్బంది పెట్టాయి. శ్రేయా తో అతను చేసిన నువ్వే నువ్వే సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

 

త్రివిక్రమ్ మాటలు రాసిన ఈ సినిమా అతని కెరీర్ ని మలుపు తిప్పింది. అలాగే కొన్ని సినిమాల్లో తరుణ్ ఆకట్టుకున్నాడు. అతని తర్వాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో మరో హీరో రాలేదు అనేది వాస్తవం. అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫేం సంపాదించుకున్నా సరే అతను కాపాడుకోలేకపోయాడు అనేది వాస్తవం. ఈ మధ్య కూడా అతని సినిమా ఏదో వస్తే అప్పటి అమ్మాయిలు ఇప్పటి ఆంటీలు ఆసక్తిగా ఎదురు చూసారు. కాని ఆ సినిమాలో అతను గతంలో తరుణ్ మాదిరిగా లేడు. ఆ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: