టాలీవుడ్ లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన హీరోల్లో సిద్దార్థ ఒకరు. తక్కువ కాలంలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాయ్స్ సినిమా నుంచే అతను లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను చేసిన బొమ్మరిల్లు సహా కొన్ని సినిమాలు అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. బొమ్మరిల్లు సినిమాలు అమాయకమైన కొడుకుగా అతను నటించిన విధానం, జెనిలియా తో అతను చేసిన రోమాన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ కాలంలోనే అతను లవర్ బాయ్ అయ్యాడు. 

 

నువ్వోస్తాను అంటే నేనొద్దంటానా సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో అతన్ని చూసి అమ్మాయిలు వాలిపోయారు. లవర్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆ సినిమా చెప్పింది. త్రిష కోసం అతను చేసిన ప్రయత్నాలు ఆ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత అతను చేసిన ఓయ్ సినిమా కూడా నటుడిగా మంచి పేరు తెచ్చింది. అయితే చేసినవి తక్కువ సినిమాలు కావడంతో అతనికి పెద్దగా కెరీర్ లో ఊపు రాలేదు. చాలా మంది దర్శకులు అతనితో సినిమాలు చేద్దామని కూడా వెనక్కు తగ్గారు.

 

అలాగే మరికొన్ని సినిమాల్లో అతను సైడ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ సినిమాలు కూడా అతని కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు అనే చెప్పవచ్చు. టాలీవుడ్ లో తమిళంలో అతను కొన్ని మంచి సినిమాలే చేసాడు. మరి ఏమైందో ఏమో ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసాడు. ఆ సినిమాలు అతనికి అంతగా ఉపయోగపడలేదు అనే చెప్పాలి. కాని అమ్మాయిలకు మాత్రం అతను డ్రీం బాయ్ అయ్యాడు. ముఖ్యంగా అతని మాటలకు అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అబ్బాయిలకు కూడా అతని మాటలు నచ్చేవి. వాటిని చూసి అమ్మాయిల వద్ద మాట్లాడే ప్రయత్నం కూడా చేసే వారు అప్పట్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: