సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఏ విషయమైనా ఇట్టే ప్రచారం అవుతుంది.. అయా వ్యక్తులకు నేరుగా మ్యాటర్ వెళ్లిపోతుంది.. ముఖ్యంగా చిత్రపరిశ్రమలో ఉన్న వారి విషయంలో ఇది మరింత అతిగా ఉంటుంది.. ఇకపోతే సోషల్ మీడియా అనేది ఒక మంచి పని కోసం ఉపయోగించాలి కాని కొందరు వ్యక్తులు దీని ద్వారా వ్యక్తిగత దూషణలకు దిగితున్నారు.. ఇదే కాకుండా మాన‌వాళి జీవితాల‌ను విశేషంగా ప్ర‌భావితం చేసిన ఒక సామాజిక విప్ల‌వం ఈ సోషల్ మీడియా అని చెప్పవచ్చూ..

 

 

సామాజిక అనుబంధాలకు వారధిగా ఉండవలసిన ఈ సోషల్ మీడియా చివరకు ఇతరుల పరువు గంగపాలు చేయడానికి ఉపయోగపడుతుంది.. ఇలాంటి బాధనే ఒక సీనీయర్ నటికి ఎదురైంది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. నటి నమిత పట్ల సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడట.. సోషల్‌ మీడియాలో సెంటమిజ్‌ అనే నెటిజన్‌  నమితకు డైరెక్ట్‌ మెసేజ్‌లు చేస్తూ.. అసభ్యకరంగా.. హాయ్‌ ఐటమ్‌ అంటూ నీచంగా ప్రవర్తిస్తున్నాడట... ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ప్రశ్నించగా అతని అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని అబద్దామాడడట. అతని మాటలు నమ్మక గట్టిగా నిలదీసేసరికి నా వద్ద నీ అశ్లీల వీడియోలు ఉన్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడట.

 

 

అతను చెప్పేది అబద్దమని తెలుసు కాబట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో అని కోపంగా చెప్పిందట.. ఇకపోతే తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడిస్తూ.. అతనిది ఒక నీచమైన మనస్తత్వం కలిగిన ప్రవర్తన. అలాంటి వారు చేసే పనికిమాలిన పనులను నేనుందుకు భరించాలి. నేను కేవలం గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నందున్న నా గురించి మొత్తం తెలుసని మీరు అనుకుంటున్నారా? లోకంలో నవరాత్రుల సందర్భంగా 9 రోజులు దుర్గా మాతను పూజించే బదులు సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకోండి. మీ జీవితంలో ఇది అతి ముఖ్యమైనది అని నమిత పేర్కొన్నారు..

 

 

ఇక ఇలాంటి పనులు చేసే వారి వల్ల మంచివారికి కూడా చెడ్దపేరు వస్తుంది.. అభిమానంతో నటీమణులను కలవాలని వెళ్లిన అంటరాని వారిగా చూస్తారు.. ఇక టెక్నాలజీ ఉంది నలుగురికి మంచి చేయడం కోసమే కాని ఇలా వ్యర్ధమైన పనులకు ఉపయోగిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడానికి కాదని నెటిజన్స్ చివాట్లు పెడుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: