అక్కినేని నాగ చైతన్య నాన్న నాగార్జున లాగ కొన్నిటిలో వీకే అని అందరు అంటుంటారు. నాగ చైతన్య కి ముందు నుంచి కొన్ని జోనర్స్ లో సినిమాలు తీస్తే అవి అసలు కలిసి రాలేదు. భారీ ఫ్లాపులను మూటగట్టుకున్నాయి. వాస్తవంగా నాగ చైతన్య కి మంచి యాక్షన్ సినిమా చేసి భారీ హిట్ కొట్టాలన్న కోరిక. కాని జనాలు యాక్స్పెట్ చేయడం లేదు. అందుకు  ఉదాహరణ యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో వచ్చి ఫ్లాపయిన దడ, ఆటో నగర్ సూర్య వంటి సినిమాలే ఉదాహరణ. ఇక డాన్స్ లోను చైతూ చాలా వీక్. తారక్, బన్ని, రాం చరణ్ లాగా డాన్స్ బాగా చేసేంత లేదు. ఇవన్ని నాగ చైతన్య కి బాగా మైనస్ గా మారుతున్నాయి.

 

ప్రస్తుతం సాయిపల్లవి-నాగచైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం "లవ్ స్టోరీ". శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఫిదా వంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి-నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడం దానికి తోడు లవ్ స్టోరీ అన్న టైటిల్ పెట్టడంతో యూత్ చాలా కాలం తర్వాత మంచి లవ్ స్టోరీ చూడబోతున్నామన్న ఆతృతలో ఉన్నారు.

 

అయితే ఈ సినిమాలో నాగ చైతన్య ఒక విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడట. హీరోయిన్ సాయిపల్లవి నాగ చైతన్యని బాగా డామినేట్ చేస్తుందని సమాచారం. డాన్స్ విషయంలో సాయి పల్లవి కి తిరుగులేదన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ధనుష్ తో వచ్చిన రౌడి బేబి సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో సాయిపల్లవితో నాగచైతన్య డాన్స్ చేయలేకపోతున్నాడట. నాగచైతన్య ఒక స్టెప్ ఒకే కావడానికి కనీసం 10-20 టేకులు తీసుకుంటున్నాడట. రీసెంట్ గా విడుదలైన 'హే పిల్లా' సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది. కానీ డాన్స్ విషయంలో మాత్రం చైతూ మైనస్ అవుతాడేమో అని కొందరు అంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో సాయి పల్లవి నాగ చైతన్యని బాగా డామినేట్ చేస్తుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: