ఉదయించిన సూర్యుడిని అడిగా కనిపించని దేవుడిని అడిగా! అన్న పాట వింటే మనకి గుర్తువచ్చే టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్. పేరులో ఉదయం ఉందికాని, జీవితంలో ఉదయం లేదు. ప్రతిరోజు ఉదయించలేక,ఒక్కసారిగా అస్తమించాడు. తెలుగులో తనకంటూ ఒక ప్రేత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని లవర్ బాయ్ అనిపించుకున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్.  కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు కూడా  సంపాదించుకున్నాడు.

 

తేజ దర్శకత్వంలో చిత్రం సినిమాతో  అందరికి పరిచయం అయ్యాడు.ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను . ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని హీరో  పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ని తీసుకున్నాడు . ఆ సినిమాలోని గాజువాక పిల్ల పాట బాగా హిట్ అయింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను  కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా తనలోని నట రూపాన్ని మల్ల చూపించాడు.

 

చిత్రం, నువ్వునేను, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు.  తర్వాత  చిరంజీవి కూతురు సుస్మితతో  2003లో నిశ్చితార్థం జరిగినది.కానీ   కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు. మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి కి అల్లుడు అయివుంట్లే ఉదయ్ కిరణ్ పరిస్థితి మరోలాగా ఉండేది. తర్వాత ఉదయ్ కిరణ్  తీసిన సినిమాలు సరిగా విజయవంతం కాలేదు. కారణం ఏదయినా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోయాడు.   తర్వాత 2005  లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు. తమిళ రంగంలో  కూడ నిలదొక్కుకోలేకపోయాడు.

 

ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన అపార్ట్మెంట్ లో ఉన్న వ్యాయామ గదిలో ఊరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఉదయ్ కిరణ్  సినిమాలో రాణించలేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, భార్య తో విభేదాల వల్ల, మద్యానికి బానిస అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతి సినీ ఇండస్ట్రీ ని దిగ్బ్రాంతి కి గురి చేసింది. ఒక లవర్ బాయ్ ని మిస్ అయ్యారు ప్రేక్షకులు.

మరణించడానికి ముందు ఉదయ్ కిరణ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు. తీసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతుంది కదా! అన్న  విలేకరి  ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు.  నిజమే . . . దానికి చాలా చాలా కారణాలు వున్నాయి. అయితే ఈ విషయంలో నేను ఎవరినీ బ్లేమ్ చేయను. ఎవరికైనా కెరీర్ ప్రారంభం మామూలు గా వుంటే తర్వాతి విషయాలు నెమ్మదిగా చూసుకొంటారు. నా విషయం లో బ్యాక్ టు బ్యాక్ విజయాలు రావడం వల్ల నేను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నాననే చెప్పాలి. దానికి తోడు నాకు మొదటి నుండీ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు, నాకంటూ ఏ గాడ్ ఫాదరూ లేరు. నా నిర్ణయాలు నేనే తీసుకోవాల్సి వచ్చేది అని తెలిపారు. ఏది ఏమయిన ఒక మంచి హీరోని కోల్పోయాము.



మరింత సమాచారం తెలుసుకోండి: