ఒక మనిషి సాధించిన, సంపాదించుకున్న మంచి పేరు గాని చెడ్డ పేరు, గొప్ప గుణం గాని, బయటకి చెప్పుకోవడం ఇష్టం లేని ఉదారత స్వభావం గాని, మానవత్వం .. ఇలా ఎన్నో విషయాలు ఆ మనిషి ఉన్నప్పటి కంటే చనిపోయాకే బయట పడతాయి. ఇక సినిమా సెలబ్రిటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత, మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, రాఘవ లారెన్స్ ఇలా చాలామంది సెలబ్రిటీస్ చేస్తున్న మంచి పనులు చాలా ఆలస్యంగా బయటకి తెలుస్తాయి. అందుకు కారణం వాళ్ళు చేస్తున్న సామాజిక సేవ బయటకి చెప్పుకోకపోవడమే. తెలిసినప్పుడు మాత్రం అందరూ ఎంతగానో అభినందిస్తారు.

 

అయితే ఈ జాబితాలో కొంతమంది చిన్న నటీ నటులు కూడా ఉండటం విశేషం. అయితే ఇక్కడ ఒక కమెడియన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎక్కడో చిన్న చిన్న మిమిక్రీ ప్రోగ్రాంస్ చేసుకుంటూ ఉన్న ఈ వ్యక్తి చిన్న చిన్న వేశాలు వేస్తూ ఏకంగా హీరోగా, నిర్మాతగా ఎదిగాడు. అందుకు చాలా కష్టపడ్డాడు. అతి తక్కువ కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరోలు నితిన్ వరకు చాలామంది హీరోల సినిమాలలో నటించాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలోను నటించి ఎంతో ఫేమస్ అయ్యాడు. దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి ఆశీస్సులతో నిర్మాతగా కూడా మారాడు. సక్సస్ అందుకున్నాడు. అయితే ఆయన రీసెంట్ గా మరణించాడు. ఆయానే వేణు మాధవ్. 

 

వేణు మాధవ్ నటించిన సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా తన సినిమాలో వేణు మాధవ్ ఉండాలని దర్శకులకి సూచించే స్థాయికి చేరుకున్నాడు. అయితే నటుడిగా వేణు మాధవ్ లో ఉన్న కోణం ఇదే కాదు. ఆయనలో ఒక గొప్ప మనసున్న వ్యక్తి ఉన్నారన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఆయన చుట్టు పక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఎంతో సహాయం చేసేవారు వేణు మాధవ్. కొంతమందికి భూములు ఎవరైనా కబ్జా చేసిన వాళ్ళు వచ్చి వేణు మాధవ్ దగ్గర మొర పెట్టుకుంటే దగ్గర ఉండి పరిష్కరించేవారు. రియల్ ఎస్టేట్ లో మోసపోయిన వాళ్ళకి సహాయం చేశారు.

 

ఇదే కాదు తను సంపాదించుకున్న కొంతలో కొంత భాగం పేదలకి దానం చేశారు. స్థలాలు, అన్న దానాలు లెక్కలేనన్ని చేశారు. ఆరోగ్య సమస్యలున్న వాళ్ళని ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. సంపాదించింది సొంత వాళ్ళకే కాదు అభిమానం చూపించిన బయట వాళ్ళకి ధారపోశారు వేణు మాధవ్. అయితే ఈ విషయాలన్ని చాలామందికి తెలీదు. అంటే చెప్పుకునేలా ఏరోజు పబ్లిసిటీని కోరుకోలేదు. అదే వేణు మాధవ్ గొప్పదనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: