కొన్ని సందర్భాలు హీరోయిన్ కి చాలా ఇబ్బంది కరంగా మారతాయి. సామాన్య అమ్మాయిలే కాస్త ట్రెండీగా డ్రెస్ వేసుకుంటే కుర్రాళ్ళు నోటికొచ్చిన విధంగా కామెంట్స్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అదే ఇంకా కాస్త నార్త్ స్టైల్లో హాట్ గా డ్రెస్సింగ్ తో బయటకి వస్తే కొందరు చూసే చూపులు అనుకునే మాటలు హద్దులు మీరిపోతుంటాయి. ఇంకా చెప్పాలంటే అసలు హద్దులే ఉండవు. అయితే సమాజంలో ఇలా కొందరి ఆలోచ‌నా ధోర‌ణి మారాలే త‌ప్ప త‌న డ్రెస్ సెన్స్‌లో మాత్రం మార్పు రావాల్సిన అవసరం లేదని అక్కినేని యంగ్ హీరో నాగ‌చైత‌న్య భార్య‌ స‌మంత తెగేసి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత యాటిట్యూడ్ లో, లైఫ్ స్టైల్ లో ఏమి మార్పు రాలేదు. వరుసగా సినిమాల‌తోను బిజీగా గ‌డుపుతున్నారు. అంతేకాదు కేవలం మజిలీ వంటి సినిమాలే కాకుండా గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌ను కూడా చేస్తున్నారామె. స‌మంత త‌న హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో వీలున్న‌ప్పుడ‌ల్లా పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అయితే నాగ‌చైత‌న్య‌ ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా పొట్టి డ్రెస్‌లు వేసుకున్న‌ందుకు సమంత ఎలా నెటిజన్స్ తో చెత్త కామెంట్స్ ని ఎదుర్కుందో తాజా వెల్లడించింది.

 

సమంత చైతూని పెళ్లి చేసుకున్న త‌ర్వాత కురచ దుస్తులు వేసుకున్నప్పుడు నెటిజ‌న్ల నుంచి తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాను. కొందరి కామెంట్స్ శృతి మించాయి. చాలా అసభ్యంగా కామెంట్స్ చేస్తూ నీచమైన పదజాలంతో విమర్శించారు. ఆ కామెంట్స్ ని సమంత తలుచుకొని తలుచుకొని సమత చాలా కాలం బాధపడిందట. అయితే రెండోసారి అలాంటి ఫొటోలను పోస్ట్ చేసినపుడు ఆ స్థాయిలో ట్రోలింగ్ జరగలేదు. అలా అలా క్ర‌మంగా ట్రోలింగ్ త‌గ్గిపోయింది. నాక‌ప్పుడు అర్థ‌మైంది ఏంటంటే మనం మొదటి అడుగు వేసినపుడే కష్టంగా ఉంటుందని. ఫ‌స్ట్ టైం ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నప్పుడు చాలా భయపడ్డా. ప్రజల ఆలోచనా ధోరణి మారాలనుకున్నా. కానీ అది అవసరం లేకుండానే సమసిపోయిందని తెలిపింది.

 

అయితే నెటిజ‌న్లు ఇలా కామెంట్స్ చేయడం కొత్తేమి కాదు. ఏ హీరోయిన్ కాస్త హాట్ గా ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ఇలాగే ట్రోల్ చేస్తుంటారు. అది చాలా కామన్. కాని సమంత లాంటి పెళ్ళి అయిన స్టార్ హీరోయిన్ కావడం తో ఆ ఇంపాక్ట్ వేరేలా పడింది. అదే కాస్త సమంత ని బాగా డిస్టర్బ్ చేసింది. అదే ఒకవేళ సమంత నాగ చైతన్య ని గనక పెళ్ళి చేసుకోకుండా ఉంటే ఇలా ట్రోల్స్ వచ్చేవి కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: