సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకొన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే మహేష్ బాబు నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు దాని విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మొన్నటి వరకూ వంశీపైడిపల్లి పేరు వచ్చినా గానీ సినిమా స్క్రిప్టులో సరైన దమ్ము లేకపోవడంతో అదే టైంలో మహేష్ బాబు... వంశీకి టైం ఇచ్చినా గాని అందులో మార్పులు చేర్పులు చేసిన గాని స్టొరీ నచ్చకపోవడంతో వంశీ పైడిపల్లి ప్రాజెక్టు పక్కన పెట్టడం జరిగింది.

 

ఇటువంటి సమయంలో చాలా మంది సీనియర్, స్టార్ డైరెక్టర్లు మహేష్ బాబు వెంటపడుతున్న తరుణంలో మహేష్ చలో మరియు భీష్మ రెండు సినిమాలతో అదిరిపోయే విజయాలు సాధించిన కూడా డైరెక్టర్ వెంకీ కుడుమల వంటి చిన్న డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా చేయటానికి రెడీ అయినట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీలో ఈ వార్త హైలెట్ వార్త గా నిలిచింది. మరోపక్క మహేష్ బాబు అభిమానులు అనవసరంగా ఈ రిస్క్ ఎందుకు నీకు అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

 

కెరియర్ పరంగా మంచి టైమింగ్ ఉన్న ఈ టైం లో అనవసరమైన ప్రయోగాలకు పాల్పడి కెరీర్ నాశనం చేసుకోవడం తప్ప అతనితో సినిమా చేస్తే ఏమి ఉపయోగం ఉండదు నీ రేంజ్ వేరు డైరెక్టర్ రేంజ్ వేరు అంటూ కొంతమంది మహేష్ అభిమానులు సూచనలు కూడా ఇస్తున్నారు .ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ అంటే చిన్న దర్శకుల వైపు చూడటం అది ఈ టైములో అనవసరమని చాలామంది అంటున్నారు. నిన్ను డీల్ చేసే సత్తా అతనిలో లేదని మరికొంతమంది సూచనలు కూడా ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: