మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గూర్చి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయనకి అభిమానులు ఎక్కువ. పవన్ పేరులోనే పవర్ ఉంది ఆ పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకులకు పూనకాలు వస్తాయి. అంతలా సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడు. స్వయానా మెగాస్టార్ తమ్ముడు. పరిశ్రమలోని  అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని కళాశాలలో పూర్తి చేసాడు. 

 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంద్వారా  మొట్ట మొదటి సరిగా పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తర్వాత ఖుషి సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. ఒక్కసారిగా యూత్ లో ఒక మార్క్ ఏర్పరిచాడు. లేడీస్ సైతం పవన్ నవ్వు కి ఫాన్స్ అయిపోయారు. ఒక్కసారి నవ్వితే చాలు అనుకునేలాగా మనసు దోచి లవర్ బాయ్ అయ్యాడు. భూమిక అండ్ పవన్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి మంచి హైప్ తెచ్చాయి. ఆ నడుము సీన్ అయితే అసలు చెప్పక్కర్లేదు అల్ టైం సూపర్ హిట్ సీన్.

 

ఆ సీన్ కి ఎన్నో డబ్బింగ్ సీన్స్ కూడా తీశారు. ఖుషిలో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించాడు. ఖుషి చిత్రంలో ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే, జానీ చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలని రీ-మిక్స్ చేయించారు.

 

ఖుషి లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్లోదిట్ట కావటంతో పవన్  చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను పవన్ చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించటం జరుగుతుంది.తమ్ముడు, తొలిప్రేమ, భద్రి, గోకులంలో సీత, సుస్వాగతం లాంటి ఎన్నో సినిమాలలో నటించి "యూత్ ఐకాన్" లా మారాడు. అంతేకాదు తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని అతనే స్వయంగా రూపొందించుకుంటాడు.

 

గబ్బర్ సింగ్ కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి మంచి హిట్ ఇచ్చింది.  అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు తీసాడు. నటి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకుని, కొన్ని కారణాల చేత విడాకులు తీసుకున్నారు.

 

ఇప్పుడు రాజకీయాలోకి కూడా వెళ్ళాడు. జనసేన అనే పార్టీ నాయకుడిగా ఉన్నాడు. సినిమా హిట్ అయిన, ప్లాప్ అయిన గాని ఫాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ని అభిమానించడం మాత్రం మానరు. పవనిజం అని ఒక కొత్త ట్రెండ్ క్రెయేట్ చేసిన ఘనత మన పవన్ కళ్యాణ్ కె దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: