టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత అక్కినేని వారి ఇంటికి కోడలు గా మారి ప్రస్తుతం సినిమాల జోరు కాస్త తగ్గించింది. పెళ్లి అయినా గాని సినిమాలో ఎక్కడా ఆపకుండా మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ రాణిస్తున్న సమంత తన నటనా ప్రతిభను కనపరిచే విధంగా వ్యవహరిస్తూ కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది. ఎక్కువగా తన దగ్గరకు వచ్చే స్టోరీలకు తన నటనకు మాత్రమే ఆస్కారముంది అని అనుకుంటున్న సినిమాలకు మాత్రమే ఓకే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తన భర్త నాగచైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 గా సమంత అక్కినేని ఎంపిక అయ్యింది.

 

ఆ సందర్బంగా సమంత ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. మీరు కంటిన్యూ అవ్వడంపై మీ భర్త చైతన్య స్పందన ఏంటీ..? పెళ్లి తర్వాత మీ సినీ జీవితం ఎలా సాగుతుందని ప్రశ్నించిన సందర్బంగా సమంత ఆశ్చర్యకర సమాధానం చెప్పింది. పెళ్లయిన తర్వాత వెంటనే సినిమాలను ఆపేయాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని చైతూ తో చర్చించడం జరిగింది...కానీ నాగచైతన్య నన్ను మందలించాడు.

 

నీకేమైనా పిచెక్కిందా. నీవు నిజంగా సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నావా అంటూ ఆశ్చర్య పోతూ అడిగాడు. పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి కారణం చైతూ అని చెప్పుకొచ్చింది. పెళ్లయిన తర్వాత సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు అన్న దాని విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు సమంత. దీంతో సమంత అభిమానులు..కొంత భద్రత భావానికి గురవుతూ సినిమాలు ఆపడం ఇలాంటి ఐడియాలు వద్దమ్మా...అంత పని చేసి మమ్మల్ని ఏకాకి చేయవద్దు అన్ని బతిమాలు తున్నారు సోషల్ మీడియాలో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: