పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలియగానే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సహం ఉప్పొంగింది. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత పవన్ సినిమాలు చేయనని చెప్పడంతో అందరూ ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. చివరి సినిమా అంటూ వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులకి నచ్చలేదు. దాంతో మళ్లీ సినిమా చేయాలంటూ మంచి హిట్ సినిమా చేసి మానేయాలంటూ సోషల్ మీడియాని హోరెత్తించారు.

 

మొత్తానికి వారి కృషి ఫలించి పవన్ సినిమాలు ఒప్పుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ఒప్పుకుని పవన్ అభిమానులకి టన్నుల కొద్దీ సంతోషాన్ని పంచాడు. పవన్ ఒప్పుకున్న మూడు సినిమాల్లో మొదటగా ప్రేక్షకులని పలకరించేది బాలీవుడ్ రీమేక్ అయిన వకీల్ సాబ్ తోనే. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే.

 


సినిమా పనులన్నింటినీ చకచకా పూర్తి చేసి మే నెలలో విడుదల చేయాలని భావించారు. అందుకు కావాల్సిన ప్రమోషన్లని కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావం పవన్ కళ్యాణ్ ని మే నెలలో రానివ్వడం లేదని అర్థం అవుతుంది. ఇప్పటికే కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇంకో పదిహేను రోజుల వరకు షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ ఆలస్యం కానుందని అర్థం అవుతుంది.

 


దాంతో పవన్ అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. ఎప్పుడెప్పుడూ పవన్ ని తెరమీద చూద్దామా అని చూస్తున్న అభిమానులకి ఈ వార్త కొంత బాధ కలిగించేదే. కానీ ఏమీ చేయలేం కాబట్టి వెయిట్ చేయడానికి రెడీ అయ్యారు. మరి కరోనా పూర్తిగా తొలగిపోయి, పవన్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో!

మరింత సమాచారం తెలుసుకోండి: