టాలీవుడ్ లో ఆయన సీనియర్... హీరో ఎన్నో దశాబ్దాల నుంచి సినిమాలు చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ సీనియర్ స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ లవర్ బాయ్. అమ్మాయిలు ఆయనను చూస్తే చాలు పిచ్చెక్కి పోతుంటారు... హీరోయిన్లు ఆయన కనబడితే చాలు ఫిదా అయిపోతుంటారు. ఐదు పదుల వయస్సు దాటి పోతున్నా ఇప్పటికీ యంగ్ హీరోలకు ఎక్కడ తీసిపోరు. ఇంతకీ ఆ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ హీరో ఎవరు అనుకుంటున్నారా. అక్కినేని నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగార్జున... మొదటి నుంచి అమ్మాయిల మనసులు కొల్లగొడుతు వస్తున్నాడు. 

 

 

 తనదైన అందంతో... అద్భుతమైన  యాక్టింగ్ తో.. అదిరిపోయే యాక్షన్ ... అంతకు మించిన ఫిట్ నెస్ తో  ఇలా ప్రతి విషయంలో నాగార్జున ఎప్పుడు అమ్మాయిలకు మన్మధుడు గా మారిపోతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ను బీట్ చేసే హీరో రాలేదు అనడం అతిశయోక్తి కాదు. ఏకంగా అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసులు ఇద్దరు హీరోలుగా పరిచయమైన... మహిళల్లో నాగార్జున క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్దాలు గడిచినా ఇప్పటివరకు ఈ హీరోకి అమ్మాయిలు క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతోమంది యువ హీరోలు ఉన్నప్పటికీ... ఈ హీరోకి ఈ హీరో ఫిట్ నెస్  కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అంతేకాదండోయ్ ఐదు పదుల వయస్సులోనూ సిక్స్ ప్యాక్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు నాగార్జున. 

 

 

 ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలకు సైతం సాధ్యంకాని ఫిట్నెస్ తో  దూసుకు పోతున్నాడు. ఇక ఐదు పదుల వయస్సు దాటి పోతున్నా ఒకప్పుడు  శివ సినిమాలో నాగార్జున ఎలా ఉన్నాడో... ప్రస్తుతం నాగార్జున అలాగే ఉన్నాడు. కాదు కాదు అంతకంటే  ఇంకా అందంగా మారిపోయాడు. అందుకే నాగార్జున ఇప్పటికీ మగువలకు లవర్ బాగానే ఉన్నాడు. ఇక టాలీవుడ్ లో చాలా  మంది హీరోయిన్లు నాగార్జున అందానికి ఫిదా అయ్యారు కూడా. అందుకే టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఇప్పటికి నాగార్జునే.

మరింత సమాచారం తెలుసుకోండి: