వరుణ్ సందేశ్... అతను చేసిన సినిమాలు తక్కువే అయినా సరే డ్రీం బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ సినిమాలు అతనికి మంచి హిట్స్ ఇచ్చాయి. ఆ రెండు సినిమాల్లో అతను నూనుగు మీసాలతో అమ్మాయిలకు డ్రీం బాయ్ అయ్యాడు. హ్యాపీ డేస్ లో తమన్నా తో రోమాన్స్ చేసాడు వరుణ్. ఆ రోమాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అతని స్మైల్ ఎందరినో ఆకట్టుకుంది అనే చెప్పుకోవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత అతను కొత్త బంగారు లోకం ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ సినిమా కూడా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది. 

 

ఇంటర్ విద్యార్ధిగా ఆ సినిమాలో అతను కనిపించాడు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్ గా అతను సరిగా సరిపోయాడు. ఆ సినిమాలో అతను శ్వేతా బసూ ప్రసాద్ తో అతను చేసిన లవ్ సీన్స్ ప్రేక్షకులను బాగా మెప్పించాయి అనే చెప్పుకోవచ్చు. ఆ విధంగా వరుణ్ సందేశ్ అమ్మాయిలకు దగ్గరయ్యాడు అనే చెప్పుకోవచ్చు. అతను ఏ సినిమా చేసినా తర్వాత అమ్మాయిలు ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు. వీడు క్లాస్ మేట్ అయితే పడేసే దాన్ని అంటూ అప్పట్లో అమ్మాయిలు అతన్ని చూసి కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. 

 

అగ్ర హీరో అవుతాడు టాలీవుడ్ కి మరో తరుణ్ దొరికాడు అనుకున్నారు అంతా. కాని అతని కెరీర్ లో వరుస ఫ్లాపులు బాగా ఇబ్బంది పెట్టాయి. తక్కువ కాలంలోనే మంచి హిట్ సినిమాలు లేక కెరీర్ ముగించాడు అనే చెప్పాలి. ఇప్పుడు అతను సినిమాలు చేయడం లేదు. ఇటీవల బిగ్ బాస్ 3 లో కనిపించాడు. ఆ షో లో భార్యతో కలిసి వచ్చాడు. ఆ షో తర్వాత అతనికి అవకాశాలు వస్తాయని భావించారు అందరూ. కాని అది సాధ్యం కాలేదు. దీనితో కెరీర్ లో సైలెంట్ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: