అక్కినేని నాగార్జున రెండో వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తొలి సినిమా `అఖిల్` నుంచి ఇప్పటి వరకు హిట్ కోసం అక్కినేని అఖిల్ దండయాత్ర చూస్తూనే ఉన్నారు. టాలెంటెడ్ దర్శకులతో పని చేసినా కూడా.. సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇప్పటి వరకు హిట్ మాత్రం రాలేదు. అయితే వాస్తవానికి అక్కినేని కుటుంబం అంటేనే కేరాఫ్ రొమాన్స్. తాతల కాలం నుంచి ఇప్పుడు వరకు అదే కొనసాగుతోంది.
కానీ, తొలి సినిమా `అఖిల్`తో కాస్త మాస్ గా ట్రై చేసి దెబ్బ తిన్న అక్కినేని అఖిల్.. రెండో సినిమా నుంచి పూర్తిగా దారి మార్చుకున్నాడు. హలోలో లవర్ బాయ్‌గా కనిపించి మాయ చేసాడు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద బోల్తా పడింది. ఇక అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలోనూ అఖిల్‌ను లవర్ బాయ్‌గా స్టైలిష్ లుక్‌లో చూపించాడు వెంకీ అట్లూరి. మరియు అమ్మాయిల వెంటపడే రోమియోలా అఖిల్ పాత్ర ఈ చిత్రంలో సరదాగా సాగనుంది. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అవ్వడంతో.. హ్యాట్రిక్ ఫ్లాపులను తన ఖాతాలో వేసుకున్న అఖిల్.
అయితే సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. అఖిల్ మాత్రం లవర్ బాయ్‌గా అటు ప్రేక్షకులను.. ఇటు అమ్మాయిలను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్న అఖిల్.. ఈ సినిమాలో పూజా హెగ్డేతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. 2020 సమ్మర్ కానుకగా అఖిల్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాజిలర్` అని టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సారైనా ఈ లవర్ బాయ్ హిట్ కొడతాడో.. లేదో.. చూడాలి.