రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో కొనసాగుతున్న ఈ చిత్ర టైటిల్ ని ఉగాది కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి ౮వ తేదీన విడుదల అవనున్న ఈ చిత్ర షూటింగ్ మొన్నటి వరకు శరవేగంగా జరిగింది.

 

కరోనా ప్రభావం వల్ల అన్ని సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణని కూడా ఆపేశారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ గడగడలాడిస్తుండడంతో ప్రతీ ఒక్కరిలో ఆందోళన మొదలైంది.  ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని చర్యల్ని పాటించాలని సోషల్ మీడియాలో రోజూ వార్తలు వస్తున్నాయి. చాలా మంది సినీ తారలు సైతం కరోనా నుండి కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలను సూచిస్తున్నారు.

 


అందులో భాగంగానే ఆర్.ఆర్.ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కరోనా బారినపడకుండా ఉండడానికి నివారణే ముఖ్యం అని చెప్తూ తగు జాగ్రత్తలు సూచించారు. ఈ వీడియో ద్వారా తమ సందేశాన్ని ప్రజలకి తెలియజేశారు. అయితే దీనిపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో చిత్రానికి ప్రమోషన్ కోసమే ఇలాంటివి చేస్తున్నారంటూ వెర్రి ఆలోచనలు చేయడం విచిత్రంగా ఉంది.

 

సాధారణంగా సినిమా వాళ్ళు ఏం చెప్పినా జనాలు ఆసక్తిగా వింటారు. ఆ ఉద్దేశ్యంతోనే ఆర్.ఆర్.ఆర్ టీం ప్రేక్షకులకి ఇలాంటి జాగ్రత్తలు సూచించిందే తప్ప చీప్ పబ్లిసిటీ కోసం కాదని, రాజమౌళి అలాంటి పబ్లిసిటీ కోరుకోడని, ఈ పాటికే ఆర్.ఆర్.ఆర్ కి కావాల్సినంత పబ్లిసిటీ ఉందని విమర్శలు చేసేవాళ్లకి సమాధానాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: