మాస్, కమర్షియల్, మసాలా అంశాలకు పెద్ద పీట వేసే తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఇమేజ్ సంపాదించుకోవటానికే హీరోలు ప్రయత్నిస్తారు. మధ్యలో కొన్ని లవర్ బాయ్ క్యారెక్టర్లు కూడా ట్రై చేస్తారు. లవర్ బాయ్ కాకపోయినా లవ్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసి ఆ జోనర్ లో కూడా సినిమాలు చేసామనిపిస్తారు. అలా లవ్ క్యారెక్టర్లు చేసిన స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేశ్ కూడా ఉన్నారు.

 

 

కెరీర్ తొలినాళ్లలో ప్యూర్ లవర్ బాయ్ గా చేసిన ప్రేమ సినిమా సూపర్ హిట్ అయింది. అటు తర్వాత కమర్షియల్ అంశాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. అలా ఎదిగాక 1997లో వచ్చిన ప్రేమించుకుందాం.. రా సినిమాతో లవ్ జోనర్ తో ఓ సినిమా చేశాడు. లవర్ బాయ్ కాన్సెప్ట్ తో ఫస్టాఫ్ నడిచే ఆ సినిమా సెకండాఫ్ కమర్షియల్ వాల్యూస్ తో నడుస్తుంది. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ ఏడాది మే 9వ తేదీన విడుదలైన సినిమా సిల్వర్ జూబ్లీ హిట్ అయి 175 రోజులు ఆడింది. కాలేజీకి వెళ్తున్న అంజలా ఝవేరి వెంట పడుతూ.. లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ ఆమెను ఇంప్రెస్ చేసే పాత్రలో వెంకటేశ్ లవర్ బాయ్ గా అప్పటి టీనేజ్, యూత్ ను ఆకట్టుకున్నాడు.

 

 

ఆ సినిమాతో యూత్ కి లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ లవ్ సింబల్ గా మారిపోయింది. సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజికల్ గా కూడా సినిమా సెన్షేషన్ క్రియేట్ చేసింది. అంజలా ఝవేరికి ఇదే తొలి సినిమా. ఈ సినిమా తర్వాత వెంకటేశ్ ప్రేమంటే ఇదేరా, ప్రేమతో రా.. వంటి లవ్ సబ్జెక్టులు కూడా చేసి కొన్నాళ్లు లవర్ బాయ్ గా నటించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: