ప్రపంచాన్నివణికిస్తున్న కరోనా వినోద రంగాన్ని కూడా దారుణంగా దెబ్బ తీసింది. కరోనా భయంతో థియేటర్లు మూసి వేశారు. దీంతో సినిమా రిలీజ్‌ లు ఆగిపోయాయి. షూటింగ్‌ లలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట చేరే అవకాశం ఉండటంతో అన్ని సినిమాలు, సీనియల్స్‌ షూటింగ్‌ ను ఉన్నపలంగా ఆపేశారు దర్శక నిర్మాతలు దీంతో భారతీయ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాలు తప్పేలా లేవు. ప్రముఖ నటుడు ఆకాన్ష రంజన్‌ కపూర్, విమర్శకుడు కోమల్‌ నహ్తా మంగళ వినోద పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు.

 

ఈ సందర్భంగా ఆకాంన్ష మాట్లాడుతూ.. `బాలీవుడ్‌ మాత్రమే కాదు ప్రతీ ఇండస్ట్రీ మూసి వేశారు. ఆఫీసలు కూడా మూత పడ్డాయి. అన్నింటికన్నా ప్రజలు ఆరోగ్యమే ముఖ్యంగా అందుకే తప్పని సరి పరిస్థితుల్లో అన్ని మూసి వేశారు. ఈ జనరేషన్‌ ఇలాంటి పరిస్థితిని తొలిసారిగా చూస్తోంది. ప్రయాణాలు ఆపాకోవాలి. ప్రజలు జిమ్‌కు వెళ్లేందుకు కూడా జంకుతున్నారు` దాదాపు 25 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్న ఆకాంన్స్‌ షూటింగ్‌ ల నిమిత్తం చాలా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ప్రయాణాలు చేయటం లేదు.


ప్రముఖ విమర్శకుడు కొమల్ నెహ్త మాట్లాడుతూ..` ఈ వైరస్‌ కారణంగా వినోద రంగంలో పనిచేసే వాళ్లు చాలా ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోజు కూలీకి పనిచేసే చాలా మందికి రోజు గడవటమే కష్టంగా మారింది. అందురూ 15 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. సినిమా షూటింగ్ అంటే హీరో హీరోయిన్ల డేట్లు.. కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే సినిమాల రిలీజ్‌లు షూటింగ్‌ లు ఆగిపోవటతో ఇండస్ట్రీ తీవ్రం సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ నష్టం 750 నుంచి 800 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు` అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: