అక్కినేని రెండో త‌రంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున‌. 1986 లో వచ్చిన విక్రమ్ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన.. మాస్, క్లాస్ సినిమాలతో పాటు భక్తిరస చిత్రాలు సైతం చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ టాలీవుడ్ మన్మథుడు. దివంగ‌త న‌టి, అందాల తార శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఇక ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ముప్పై ఏళ్లుపైనే అవ‌తుంది. మ‌రియు టాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయకులలో నాగార్జున ఒకరు. 

 

ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా ఆయన చేసిన సినిమాల్లో 'మన్మథుడు' ముందు వరుసలో కనిపిస్తుంది. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఒకటిగా ఇది నిలిచింది. అయితే ఇటీవ‌ల మ‌న్మ‌థుడు సీక్వెల్‌గా మ‌న్మ‌థుడు 2 చిత్రం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం. ఈ చిత్రంలో నాగార్జున ల‌వ‌ర్ బాయ్‌గా కాదు.. అంత‌కు మించి అమ్మాయిల‌తో రొమాన్స్ చేశాడు.

 

ఈ చిత్రంలో పెళ్లి కాకపోయినా.. అమ్మాయిలతో వీర లెవ‌ల్లో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసే క్యారెక్టర్ లో నాగార్జున కనిపిస్తాడు. ఇక ఈ చిత్రం చూసిన ప్రేక్ష‌కులు.. ఈ వయసులో నాగార్జున అలాంటి క్యారెక్టర్ చేయ‌డం అవ‌స‌ర‌మా అని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే నాగార్జున‌పై ఎన్నో విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. లేటు వయసులో నాగార్జున ఘాటు రొమాన్స్ అంటూ వివిధ ర‌కాలుగా ప్ర‌చారం కూడా చేశారు కొంద‌రు. అంతేకాకుండా.. ఈ సినిమా ఫ్రెంచ్ సినిమాకు కాపీ అంటూ కొత్త పుకార్లు కూడా హల్‌చల్ చేశాయి. ఇక ఏదేమైన‌ప్ప‌టికీ.. ఈ చిత్రం చివ‌ర‌కు బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తాప‌డి.. నాగ‌ర్జున‌ను ట్రోల్స్‌కు గురిచేసింది.
 
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: