కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మాస్టర్. కార్తి హీరోగా తెరకెక్కిన ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌ కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ పై తాజాగా ఓ వివాదం తెర మీదకు వచ్చింది.

 

టైటిల్ తో పాటు విజయ్‌ లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే ఆ తరువాత కోలీవుడ్ నటి మీరా మిథున్‌ దాదాపు అలాంటి స్టిల్‌ నే తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు మీరా విజయ్ స్టిల్‌ను కాపీ కొట్టింది అంటూ నెటిజెన్లు కామెంట్ చేశారు. మీరాను టార్గెట్‌ చేస్తూ విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయటంలో ఆమెకు కోపం వచ్చింది.

 

దీంతో వాళ్ల ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది మీరా. తన ట్విటర్ పేజ్ లో తన ఫోటోను మరోసారి పోస్ట్ చేసిన ఎవరి స్టిల్‌ ను ఎవరు కాపీ చేశారు. ఇది నేను 2019 డిసెంబర్ లో జరిగిన కింగ్ ఫిషర్ రాంప్‌ వాక్ తరువాత తీసిన ఫోటో అంటూ ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చింది. అంతేకాదు విజయ్ అభిమానులను మరింత రెచ్చగొట్టే విధంగా మాస్టర్ సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌ లను జోడించింది. మరి ఈ పోస్ట్ పై విజయ్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: