కునాల్ సింగ్ అందమైన మొహం. అమాయకమైన చూపు ఆకట్టుకునే రూపం ఆకర్షించే అభినయం. కునాల్ సింగ్ ను సౌత్ స్క్రీన్ పైన హీరోగా పరిచయం చేశారు. కునాల్ సింగ్ మోడలింగ్ బ్యాగౌండ్ ఉండటంతో తమిళ దర్శకుడు ప్రేమికుల రోజు సినిమాతో దక్షిణ వేడితెరకు పరిచయం చేశారు. 

 

ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను ఇంటర్ నెట్ ప్రేమ కథతో ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. ఏ.ఆర్. రెహమాన్ సినిమాలో పాటలకు అప్పట్లో మంచి ఆదరణ ఉండేది. ఈ సినిమా అటు తమిళ్, ఇటు తెలుగులోను ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

సినిమా తర్వాత కునాల్ నటించిన రెండు సినిమాలు ఘోర పరాజయాలు అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ కునాల్ సింగ్ హీరోగా నిలదొక్కుపోయాడు. మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకోలేకపోయాడు. ఆపై అతను హీరోగా కొనసాగలేకపోయాడు. చాలా సినిమాలకు అసిసెంట్ ఎడిటర్ గా పని చేశాడు. ఆ తరువాత కొన్ని సినిమాలను నిర్మించాడు. 

 

కునాల్ సింగ్ కి అనురాధ సింగ్ తో పెళ్లయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాల నిర్మాణం వలన తీసుకొచ్చిన నష్టాలు, హీరోగా ఆఫర్స్ లేకపోవడం నటి లాబీనా ఘటితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అన్ని కలగలిసి భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.

 

కునాల్ సింగ్ తన భార్య ఇంట్లో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అతని ప్రేయసి లాబీనా ఘటియా కూడా అక్కడే ఉన్నారు. కానీ కునాల్ కొన్ని నెలల ముందు తన మాణికట్టును కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ కునాల్ చనిపోవడానికి ముందు తన బ్యానర్ పై యోగి అనే సినిమాను నిర్మిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: