తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిచూపులు చిత్రం తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీావాలా లాంటి వరుస హిట్స్ తో దుమ్ముదుళిపాడు విజయ్ దేవరకొండ.  ఈ చిత్రాల తర్వాత నోటా, డీయర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో వరుస ఫ్లాపులు అందుకున్నాడు.  అయినా విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ లో ఏమాత్రం తగ్గడం లేదు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫైటర్’ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ మద్య క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం.

 

కాగా,  ఈ చిత్రంలో రెండు ఎపిసోడ్లు మాత్రమే ఆకట్టుకున్నాయి. మిగతా కథ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దాంతో ఈ  చిత్రం పరాజయాన్ని చవిచూసింది. తాజాగా   ఈ చిత్రాన్న బాలీవుడ్ లో రిమేక్ చేయాలనే ఆలోచనలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆలోచిస్తున్నారట. ఇటీవల ఈ చిత్రాన్ని ఆయన చూశారట.. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా తీర్చి దిద్దితే చిత్రం మంచి సక్సెస్ అవువుతందని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందువలన ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు.

 

మూడు ట్రాకుల్లో .. నలుగురు హీరోయిన్స్ తో సాగుతుంది గనుక, ఈ కథ నిజంగానే హిందీ ఆడియన్స్ కి నచ్చుతుందేమో చూడాలి. ఇప్పటికే కరణ్ జోహర్ దృష్టి మనోడు పడటం.. ఓ చిత్రానికి కమిట్ అయ్యే ఆలోచనలో ఉండటం తెలిసిందే. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘ఫైటర్ ’ తెరకెక్కబోతుంది.  మరి బాలీవుడ్ లో గనక ఈ రౌడీ హీరో సక్సెస్ సాధిస్తే జాతీయ స్థాయి నటుడుగా గుర్తింపువస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: