తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సూర్య కు ఎంతో మంచి క్రేజ్ ఉంది.  ఆయన నటించి ఎన్నో చిత్రాలుగు తెలులో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.  సూర్య తెలుగు లో హీరోలందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు.. ఇక్కడ ఏ చిన్న విపత్తు వచ్చినా వెంటనే స్పందిస్తూ తన వంతు సహాయం చేస్తుంటారు.  తెలుగులో సూర్యకు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.  తాజాగా 'ఆకాశమే నీ హద్దురా'  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.  సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం  పై అభిమానుల్లో ఆసక్తి వుంది. తదుపరి ప్రాజెక్టును ఆయన హరి దర్శకత్వంలో చేస్తున్నాడు.  

 

'అరువా' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.  ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  గతంలో సూర్య 'బ్రదర్స్' చిత్రం లో కవల సోదరులుగా కనిపించాడు. ఈ చిత్రం ఆయన ప్రయోగాత్మకంగా నిలిచింది.  ఆయన కెరీర్ లోనే ఇదో వైవిధ్యభరితంగా నిలిచింది. ఇప్పుడు   'అరువా' చిత్రంలో   ను సూర్య కవల సోదరులుగా కనిపించనున్నాడు. ఈ చిత్రం కూడా ఓ ప్రయోగాత్మకంగా రూపొందబోతుందట. ఇందులో సూర్య హీరోగా, విలన్ గా కనిపించబోతున్నారట. 

 

ఆ మద్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 చిత్రంలో కూాడా ఒక క్యారెక్టర్ విలన్ గా నటించి మెప్పించాడు సూర్య.  తన పాత్రల విషయంలో ఎప్పుుడూ వివిధ్యంగా ఉండేలా చూసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ మద్య సూర్యకు అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇటీవల వరుస పరాజయాలతో మార్కెట్ తగ్గిపోయింది. ముఖ్యంగా సూర్య గత ఆ మద్య వచ్చిన చిత్రాలు NGK, బందోబస్త్ గురించి తక్కువగా మాట్లాడితే మంచిది.  ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా'  చిత్రం ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ ఆర్ గోపినాథ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: