టీం ఇండియా లో రోహిత్ శర్మ స్టార్ ఆటగాడు. ఓపెనర్ గా రోహిత్ వస్తుంటే చాలు అతని అభిమానులు చేసే హడావుడి చేస్తూ ఉంటారు. మైదానంలో రోహిత్ ఉంటే చాలు రోహిత్ రోహిత్ అంటూ మైదానంలో ఉండి అభిమానులు చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే అతని జీవితంలో ఒక అందమైన ప్రేమ కథ ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. తనకు మేనేజర్ గా పని చేసిన రితిక సజ్దేష్ ని అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ ప్రేమ తర్వాత ఈ ఇద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఈ ప్రేమ కథనే సినిమాగా తీయాలని చూస్తున్నారు. ముందు రోహిత్ బయోపిక్ ని తీయాలని చూసారు. మరి ఏమైందో ఏమో గాని అతని లవ్ స్టోరీ తెలుసుకున్న ఒక అగ్ర దర్శకుడు వారి లవ్ స్టోరీని సినిమాగా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి రోహిత్ ని కలిసి అతను వివరాలు కూడా అడిగారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. రోహిత్ శర్మ కూడా ఆసక్తి చూపించడం తో దర్శకుడు కూడా దూకుడుగా పని చేస్తున్నారని అంటున్నారు. 

 

త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వారి పాత్రలను ఎవరు చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ముందు షాహిద్ కపూర్ అనుకున్నా ఆ తర్వాత మాత్రం రణబీర్ కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. నిర్మాతగా రోహిత్ శర్మ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఆయన అందుకు అంగీకరించాడు అని కూడా అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: