ఆర్.ఆర్‌.ఆర్‌. చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న హీరో రాంచ‌ర‌ణ్ ఎంతో సామాజిక స్పృహ‌తో ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కోర‌లు విప్పి మ‌రీ కాటేద్దామ‌ని చూస్తోంది. ఈ నేప‌ధ్యంలో సెల‌బ్రెటీలు సైతం చాలా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు. వీలైనంత వ‌ర‌కు సినిమా షూటింగ్‌లు, ఫంక్ష‌న్లు, ఇంకా సినిమా రిలీజులు ఇలా వీలైనంత వ‌ర‌కు వీట‌న్నిటికి దూరంగా ఉంటున్నారు. ఇక క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తోన్న నేప‌ధ్యంలో... దీన్ని దృష్టిలో పెట్టుకుని సెల‌బ్రిటీలు కార్య‌క్ర‌మాల‌ని ర‌ద్దు చేసుకుంటున్నారు. చిరంజీవి కొర‌టాల చిత్రం, నాగార్జున వైల్డ్ డాగ్ అలాగే మ‌రికొంద‌రైతే వివాహాలు కూడా పెండింగ్‌లో పెట్టుకుంటున్నారు. తాజాగా నితిన్ వివాహ వేడుక దుబాయ్‌లో అనుకున్నారు కాని అది క్యాన్సిల్ చేసి హైద‌రాబాద్‌లోనే చేస్తున్న‌ట్లు స‌మాచారం అందించారు. తాజాగా మోహ‌న్‌బాబు కూడా త‌న పుట్టిన‌రోజు వేడుల్ని ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా అదే బాట‌లో మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ కూడా త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా వుండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

 

ఇక ఈ విష‌యం పై ఆయ‌న‌ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేశారు. `మీకు నా మీద ఉన్న ప్రేమ‌ని, నా పుట్టిన రోజు వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మీరు ప‌డుతున్న క‌ష్టాన్ని అర్థం చేసుకోగ‌ల‌ను. కాని ప్ర‌స్తుతం ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మ‌నం వున్న ఈ అసాధార‌ణ ప‌రిస్థితులు మీకు తెలియ‌నివి కాదు. ఈ సంద‌ర్భంలో మ‌న చుట్టూ జ‌నం త‌క్కువ‌గా వుండేలా, అధిక సంఖ్య‌లో స‌మూహాలు వుండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. దీన్ని మ‌న‌సులో పెట్టుకుని నా పుట్టిన రోజు వేడుక‌ల‌ను విర‌మించుకోవాల‌ని నా మ‌న‌వి గా` తెల‌య‌జేస్తున్నాను అంటూ   రామ్‌చ‌ర‌ణ్ ఓ లెట‌ర్‌ని విడుద‌ల చేశారు. దీంతో మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా వుండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ విష‌యం పై క్లారిటీగా రాంచ‌ర‌ణ్ ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉపాస‌న అట‌. ఆల్రెడీ ఉపాస‌న ఎప్పుడూ త‌న అపోలో సంస్థ నుంచి ఏదో ఒక హెల్త్ క్యాంప్ లాంటివి మెడిసిన్స్ పంచ‌డాలు లాంటివి త‌ర‌చు చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఈ విష‌యం పై చ‌ర‌ణ్‌ని చాలా జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని ఉపాస‌న చాలా గ‌ట్టిగా ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అలాగే కుదిరినంత వ‌ర‌కు ఉపాస‌న కూడా మాస్క్‌లు అటువంటివ‌న్నీ పంచే ప‌నిలో బిజీగా ఉన్నార‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: