స్టార్.. స్టార్.. మెగా స్టార్.. స్టార్.. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ. ఇక మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్ అంటే.. అంబరమంత సంబరం.. అభిమానుల కోలాహలానికైతే.. ఇక అంతే ఉండదు. కొన్నాళ్ల క్రితం, మెగాస్టార్ మేనల్లుడు.. సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం  సందర్భంగా.. ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు గారిని దృష్టిలో ఉంచుకుని, సదరు కార్యక్ర‌మంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ప‌లు విష‌యాల‌ను గురించి చర్చించారు.

 

 


1983వ సంవత్సరానికి క్రితం జరిగిన ఓ మంచి విషయాన్ని అయన గుర్తుచేసుకున్నారు. ఆ దశాబ్దంలో కె.ఎస్. రామారావు ప్రొడ్యూసర్ గా అద్భుతమైన సినిమాలు చేయడంతో ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోనే ఆయనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆ టైములో మన మెగాస్టార్ కు అతనితో సినిమా చేయాలనే కోరిక మనసులో బలంగా ఉండేదట..!

 

 


అయితే ఆ సమయంలో చిరంజీవి అమ్మ‌గారు, యండమూరి అభిలాష అనే న‌వ‌ల చదివారట! గమ్మత్తు ఏమంటే, అందులో హీరో పేరు కూడా చిరంజీవి అట. అది చ‌దువుతున్నంత సేపు చిరంజీవే గుర్తొచ్చారని, మెగాస్టార్ ను ఊహించుకొనే సదరు నవల చదివిందట అంజనాదేవి గారు. అయితే అదే విషయాన్ని.. కొడుకు చిరంజీవితో చెప్పి, దాన్ని సినిమాగా తీస్తే.. బావుంటుందిరా అని అన్నారట! ఇక దాంతో మన చిరంజీవి గారికి కే.ఎస్ రవికుమార్ నిర్మాణంలో ఆ సినిమా చేస్తే బావుంటుందనే కోరిక మనసులో బాగా కలిగిందట..!

 

 


తరువాత కొన్నాళ్ళకు చిరంజీవిగారు చెన్నై వెళ్లారట. అక్కడ ఓసారి కలిసిన రామారావుగారే స్వయంగా.. చిరంజీవి గారితో.. యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌గారు రాసిన అభిలాష న‌వ‌ల గురించి చెప్పి, సినిమా చేద్దామా అనేస‌రికి.. అతనికి అంజనాదేవి గారు చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయట. ఆ టైంలో అమ్మ సిక్స్త్ సెన్స్ బాగా పనిచేసిందని.. ఎంతో సంబరపడి అయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: