టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు.  అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగార్జున తర్వాత సుమంత్, నాగ చైతన్య తర్వాత సుశాంత్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. అక్కినేని సోదరి అక్కినేని నాగసుశీల తనయుడు. అన్నపూర్ణ స్టూడియోస్.. జి.రవిచరణ్‌రెడ్డి దర్శకత్వంలో ‘కాలిదాస్’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత కరెంట్ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  తర్వాత అడ్డా, దొంగాల, చి.ల.సౌ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం సంపాదించుకోలేక పోయాడు.  ఈ ఏడాది త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ నటించి మంచి పేరు సంపాదించాడు.  

 

అల వైకుంఠపురంలో మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించిన సుశాంత్ తన తదుపరి మూవీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' తో ముందుకొస్తున్నాడు. 'నో పార్కింగ్' అనే టాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శన్ అనే యువ దర్శకుడు పరిచయమవుతున్నాడు. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన చిన్న వీడియోను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ వీడియోలో కొత్తగా కొన్న రాయల్ ఎన్ఫీల్డ్  బైక్ ను నడుపుకుంటూ వచ్చి నోపార్కింగ్ బోర్డు ముందు ఆపడం చూపించారు.

 

ఈ మూవీలో సుశాంత్ అల్లరి చిల్లరిగా ఉండే పాత్రలో కనిపిస్తున్నాడు.  ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ తో పాటు మంచి ఎమోషన్ సీన్లు కూడా ఈ మూవీలో ఉండబోతున్నాయట. చిలసౌ సినిమా మినహా సుశాంత్ కు ఇప్పటి దాకా సరైన సోలో హిట్ లభించలేదనే చెప్పవచ్చు.  కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ అక్కినేని వారసుడు మరి ఈ మూవీతో అయినా సరైన హిట్ కొడతాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: