రానా.. ఆరడుగుల ఆజానుబాహుడు. ఎట్రాక్టివ్ బాడీతో  చూడగానే ఫుల్ మజిల్స్ తో కంప్లీట్ మస్కులర్ బాడీతో మ్యాన్ లీ గా ఉంటాడు. అలాంటిది 30కేజీలు తగ్గి బక్కగా.. ఏమాత్రం మజిల్ లేకుండా పేషెంట్ గా కనిపిస్తున్నాడు. స్లిమ్ గా, టోన్డ్ బాడీతో సూపర్ ఎట్రాక్టివ్  ఫిజిక్ తో ఉండే హీరోయిన్ కంగనా.. 20కేజీలు బరువు పెరిగి బొద్దుగా ,, లావుగా దర్శనమిచ్చింది. ఇంతకీ ఈ డ్రాస్టిక్ ఛేంజ్ ఎందుకో ..ఏంటో అని ఆరా తీస్తే విషయం ఇలా ఉంది.   

 

 

 సినిమా .. అల్టిమేట్ గా సినిమా కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అయిన వాళ్ల దగ్గరకే సక్సెస్ వస్తుంది. అందుకే  సినిమా కోసం కేజీలు కేజీలు వెయిట్ పెరుగుతారు. కావాలంటే కష్టపడి తగ్గుతారు. అంతకుముందు ఈ ఎక్స్ పరిమెంట్లు పెద్దగా చెయ్యని స్టార్లు ఇప్పుడు తమ బాడీ మీద ప్రయోగాలు చేస్తూ.. సక్సెస్ కి చేరువవుతున్నారు. ఫుల్ మస్కులర్ బాడీతో మ్యాన్ లీ హంక్ లా ఉండే రానా.. ఇప్పుడు బక్క పలచగా.. అసలు ఏమాత్రం తన బాడీని పట్టించుకోకుండా లీన్ గా కనిపిస్తున్నాడు. హెల్త్ బాలేదన్నారు. అదన్నారు ఇదన్నారు.. తీరా ఆరా తీస్తే.. ఇదంతా అరణ్య సినిమా కోసం అని చెప్పాడు. తెలుగు, తమిళ్, హిందీ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా.. అడవి మనిషి రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గి.. సన్నగా లీన్ గెటప్ లోకి మారిపోయాడు.

 

 

ప్రభాస్.. అంటే ఫుల్ హ్యాండ్సమ్ గా కండలు తిరిగి ఫిజిక్ తో కనిపిస్తాడు. కానీ ఇప్పుడు బాహుబలిలా  ఆ మస్కులర్ ఫిజిక్ లేదు ప్రభాస్ కి. ఎందుకంటే.. ప్రభాస్ జాన్ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. అందుకే ఆ సినిమా కోసం దాదాపు 15 కేజీలు  వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు రెబల్ స్టార్. మరో హీరో బాలకృష్ణ కూడా తన అప్ కమింగ్ మూవీలో బాగా వెయిట్ లాస్ అయ్యి కనిపిస్తున్నాడు. బోయపాటి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమాలో బాగా స్లిమ్ అయ్యాడు బాలకృష్ణ. ఈ సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో బాలయ్య కనిపించబోతుండడంతో కంపల్సరీగా లుక్ వేరియేషన్ కోసం 10కేజీల వెయిట్ లాస్ అవుతున్నాడు బాలకృష్ణ. 

 

 

అందరూ వెయిట్ తగ్గుతుంటే ఇక్కడ హీరోయిన్ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. అసలు హీరోయిన్ అంటేనే సో కాల్డ్ ఫిజిక్ మెయింటెన్ చెయ్యాల్సి ఉంటుంది. కానీ  కంగనా రనౌత్ విషయానికొస్తే.. సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ..ఏకంగా 20 కేజీల బరువు పెరిగింది. కంగనా 52 కేజీల వెయిట్ ఉంటే సినిమా కోసం 70 కేజీల వెయిట్ పుట్ ఆన్ అయ్యింది. ఇదంతా తలైవి సినిమా కోసం. తమిళ నాట రాజకీయాల్ని, సినిమాల్ని ప్రభావితం చేసిన మోస్ట్ పవర్ పుల్ విమెన్ జయలలిత బయోపిక్ లో.. జయలలితగా నటిస్తోంది కంగనా. అందుకే ఆ లుక్ కోసం 20 కేజీల వెయిట్ పుట్ ఆన్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: