కరోనా దెబ్బ ప్రపంచమంత రెండు సునామీలు వస్తే ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా ఉంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న ఈ దిక్కుమాలిన కరోనా నే టాపిక్ అవుతుంది. గత వారం రోజులుగా చెన్నై, వైజాగ్, హైదరాబాద్ సహా దాదాపు అన్నీ ప్రాంతాలలో షాపింగ్ మాల్స్, సినిమా థియోట్ర్స్, మల్టీ ప్లెక్స్, కంపెనీస్, స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్ ఇలా.. అన్ని బంద్ నిర్వహిస్తున్నారు. చెప్పాలంటే జనాలు బయటకి రాక ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీస్ లోను దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. షూటింగులు బంద్.. రిలీజ్ లు బంద్...కావడంతో చిత్ర పరిశ్రమ కుదేలయినపరిస్థితి నెలకొంది. 

 

ఇక కొవిడ్-19 రెండవ దశలో ఉన్నందున ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు చిత్ర పరిశ్రమలోని పెద్దలందరూ కలికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈనెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలు కొన్నాళ్ళు వాయిదా వేయాల్సి వచ్చింది. నాని-సుధీర్ బాబు నటించిన 'వీ', రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా'.. ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' లాంటి సినిమాలు ఈనెల 25న రిలీజ్ కావాల్సి ఉండగా తప్పని పరిస్థితుల్లో వాయిదా పడ్డాయి. 

 

దాంతో ఈ కరోనా కొట్టిన దెబ్బ చాలా మంది మేకర్స్ గట్టిగా తగిలింది. ఇంకా చెప్పాలంటే కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. మార్చ్ నెలలో రిలీజవ్వాల్సిన అన్ని సినిమాలు ఏప్రిల్ కి వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 2 వ తారీఖున సినిమాలు రిలీజ్ అని చెప్పుకొస్తున్నప్పటికి అది సాధ్యపడే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. అయితే ఈ సినిమాలన్నీ ఏప్రిల్ లో రిలీజ్ కు ఆల్రెడి డేట్ లాక్ చేసుకున్న కొన్ని సినిమాలను బట్టి మార్చ్ నుండి పోస్ట్ పోన్ అవుతున్న సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏప్రిల్ లో మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన'.. అనుష్క నటించిన 'నిశబ్ధం'..రానా నటించిన 'అరణ్య' భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్నాయి. అయితే మార్చ్ లో అనుకున్న నాని, రాజ్ తరుణ్ సినిమాలు కూడా ఇదే నెలలో రిలీజ్ అనుకుంటే మాత్రం ఇక్కడ థియోటర్స్ సమస్య వస్తుంది.

 

కరోనా ఎఫెక్ట్ లేకపోతే మార్చ్ నెలలో రిలీజ్ కు అనుకున్న సినిమాలు 'వీ'.. 'ఒరేయ్ బుజ్జిగా' కాబట్టి ఆ సినిమాలకే ముందుగా థియేటర్ల కేటాయించాలని ఇండస్ట్రీలో పెద్దలు సూచిస్తున్నారట. మరి ఈ కండీషన్ కి మైత్రీమూవీ మేకర్స్ ఉప్పెన ని వాయిదా వేసేందుకు అంగీకరిస్తారా..? అనుష్క నిశబ్ధం టీమ్ కూడా రిలీజ్ ని వాయిదా వేసి తగ్గుతుందా .. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో నిర్మాతలు గొడవలు పదేలా కనిపిస్తోంది. ఎటు తిరిగీక్కడ సమస్యలు చుట్టుముడుతున్నది నిర్మాత దిల్ రాజుకే. పాపం అసలే భారీ ఫ్లాప్స్ తో సతమతమవుతుంటే ఈ కరోనా ఇంకా ఏడిపించుకు తింటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: