చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తూ అందరిని హడలిస్తోంది. ఇండియాలో అత్యంత వేగంగా వ్యాప్తిస్తున్న ఈ కరోనా వైరస్ తో ఎక్కడికక్కడ అన్ని నిలిచిపోయాయి. ఒకరకంగా అందరికి అర్థమయ్యోలా చెప్పాలంటే కర్ఫ్యూ, భారత్ బంద్ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. సాఫ్ట్ వేర్ తో అన్ని ఇండస్ట్రీస్ మీద ఈ   కరోనా ప్రభావం భాగా పడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీల కి వేల కోట్ల నష్టం వాటిల్లనుందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సినిమాల షూటింగ్స్, ఆ సినిమాల విడుదల వాయిదా.. థియేటర్లు మూసివేత ఇలా అన్ని రకాల సమస్యలతో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది.

 

ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి ఏంటీ ..? అంటూ అంతటా ఆసక్తికరమైయిన చర్చలు మొదలయ్యాయి. 2021 సంక్రాంతికి రిలీజ్ లక్ష్యంగా పెట్టుకొని నిర్విరామం గా షూటింగ్ జరుగుతున్నప్పటికి అర్ధాంతరంగా షూటింగ్ ఆపేయాల్సి వస్తుంది. దీంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్లీ మారుతుందేమో అంటూ చాలా మంది అంటున్నారు. 

 

ఎందుకంటే కరోనా ప్రభావం జూన్ లేదా జులై వరకు ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్ఆర్ఆర్ కి చిక్కులు తప్పవంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ డేట్ మారుతుందని  సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక 80 శాతం షూటింగ్ పూర్తి అయిన ఆర్ఆర్ఆర్ కి మిగతా వర్క్ గనక పూర్తి చేయగలిగితే మాత్రం రిలీజ్ డేట్ లో మార్పు ఉండే అవకాశమే రాదు అంటున్నారు రాజమౌళి బృందం. కాని రాజమౌళి అనుకున్నట్టు గనక అన్ని కార్యక్రమాలు సజావుగా సాగకపోతే మాత్రం ఆర్ఆర్ఆర్ మీద అన్ని రకాలుగా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఎరగని రాజమౌళి కి ఈసారి కాస్త రిస్క్ అయ్యోలా పరిస్థితులు రావచ్చు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: