చాలామంది శృంగారానికి ముందు పడక గదిలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేయడం వారికి ఒకరకమైన సరదా అనిపిస్తుంది. అయితే ఈ పెద్ద పెద్ద సౌండ్ దంపతులు ఇద్దరికీ న‌చ్చాల‌న్న రూల్ లేదు. దీంతో శృంగారంలో పాల్గొనే భాగస్వామి అభిరుచిని బట్టి నడుచుకోవాలని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. శృంగారం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. దంపతుల దాంపత్య జీవితం ఆనందంగా ఉండేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తున్నది. అలాగే మరొక ప్రాణి భూమి మీదకు రావ‌డంలో కూడా శృంగారం ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

అందుకే దంపతులు ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొనాలని ఉంటుంది. ఈ విషయంలో స్త్రీలు ప్ర‌త్యేక‌ జాగ్రత్తలు తీసుకోవాలి... లేని పక్షంలో వారు అనారోగ్యం భారిన పడి ఇబ్బందులకు గురి కావలసి ఉంటుంది. చాలామంది దంపతులు శృంగారం మధ్యలో చేసే పొరపాట్లు అసలుకే ఎసరు తెచ్చేలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే శృంగారానికి ముందు బెడ్ రూంలో పెద్ద పెద్ద‌గా మ్యూజిక్ పెట్ట కూడ‌ద‌ట‌. ఈ విష‌యంలో భాగ‌స్వామి అభిరుచి తెలుసుకున్నాకే మ‌న‌కు న‌చ్చే ప‌ని వాళ్ల‌కు న‌చ్చుతుందా ?  లేదా ? అన్న‌ది తెలుసుకుని చేయాల‌ట‌.

 

ఇక మ‌రి కొంద‌రు బెడ్ రూంలోకి వెళ్లినా స్మార్ట్‌ఫోన్ వ‌ద‌ల‌రు. దీని వ‌ల్ల భాగ‌స్వామికి చిరాకు వ‌స్తుంది. దీని వ‌ల్ల వారి మూడ్ ఆఫ్ అవుతుంది.. అలా జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. మ‌రి కొంద‌రు డైరెక్టుగా శృంగారంలోకి వెళ్లి త‌మ కోరిక‌లు తీర్చుకుంటారు. అది భాగ‌స్వాముల‌కు న‌చ్చ‌దు. ముందుగా అందుకు త‌గిన విధంగా మూడ్ ప్రిపేర్ చేసి.. వారిని అందుకు ప్రేరేపించి అప్పుడు శృంగారం చేయాల‌ట‌. అందుకే ముందుగా ముద్దుల‌తో మొద‌లు పెట్టి ఆ త‌ర్వాత వాళ్ల‌ను ప్రేరేపిస్తూ శృంగారం వాళ్లు ఎంజాయ్ చేసేలా చేస్తే అప్పుడు ఇద్ద‌రికి తృప్తి ఉంటుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: