సినిమా ఇండస్ట్రీలో చాలా కొద్ది మందిని మాత్రమే మహానుభావులు అంటాము. ఆలాంటి వాళ్ళలో ప్రముఖ రచయిత.. నటుడు అయిన స్వర్గీయ గొల్లపూడి మారుతిరావు గారు ఖచ్చితంగా ఉంటారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతూ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోకుండా 250 సినిమాలలో నటించాడు. అప్పటికే గొల్లపూడి గారు రచయితగా ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉన్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.  

 

ఇక మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ .. తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించాడు. అందుకు మారుతీరావు తన కుమారుని జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు ప్రతి సంవత్సరం ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రధానం చేస్తున్నారు. అయితే ఈ అవార్డ్ ను కేవలం ఒకే ఒక్క ఉత్తమ దర్శకుడికి ఇవ్వడం ఆసక్తికరమైన విషయం.

 

అందులో భాగంగా 2019 సంవత్సరంకు గాను యూరి చిత్ర దర్శకుడు ఆధిత్య నాథ్ ఇంకా మలయాళ చిత్ర దర్శకుడు మధు సి నారాయణన్ లకు కలిపి ఈ సారి అవార్డును ప్రధానం చేయబోతున్నారు. కాని ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈసారి అవార్డు వేడుక గొల్లపూడి మారుతి రావు గారు లేకుండా జరుగుతోంది. ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన గొల్లపూడి లేకపోయినప్పటికి ఆయన మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఎలాంటి విఘాతం లేకుండానే అవార్డు వేడుక నిర్వహిస్తుండటం విశేషం. దీంతో ఇండస్ట్రీలో చాలామంది కొన్ని మహత్తరమైన కార్యక్రమాలు మహానుభావులు లేకుండనే నిర్వహించాల్సి వస్తుందని తమ ఆవేదనని తెలుపుతున్నారు. వాళ్ళలో కోటా శ్రీనివాస్ రావు గారు, బాబు మోహన్ గారు, పరుచూరి సోదరులు, తమ్మారెడ్డి భరద్వాజా తదితరులున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: