తెలుగు సినిమా రంగంలో నటి సురేఖ రాణి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. చాలా సినిమాలలో హీరోయిన్ పక్కన నటించే సురేఖ వాణి ఎక్కువగా శ్రీను వైట్ల సినిమాల్లో కనబడుతుంటుంది. పేరు తెలియకపోయినా గాని ఫోటో చూస్తే ఖచ్చితంగా గుర్తు పట్టడం గ్యారెంటీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో 50 కి పైగా తెలుగు సినిమాల్లో నటించి చాలా విభిన్నమైన క్యారెక్టర్లు చేసిన సురేఖ సినిమా ఆడియన్స్ నూ బాగా అలరించారు. ముఖ్యంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడీ మూవీలో చిట్టి నాయుడుకు అమ్మగా సురేఖ నటించిన నటన సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. కొడుకును అడ్డంపెట్టుకుని మామ గారిని అడ్డమైన తిట్లు తిడుతూ ప్రేక్షకులను నవ్వు తెప్పించే విధంగా క్యారెక్టర్లు అలరించారు సురేఖ. సినిమాలు మరియు ఇంకా అనేక విషయాలు పక్కన పెడితే సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

 

ఈ మధ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటో ఒకటి షేర్ చేశారు. ఆ ఫోటోలో ఒక అందమైన లొకేషన్లలో నీటిలో జలకాలాటలు ఆడుతూ కాస్త గ్లామరస్ డోస్ పెంచే విధంగా ఫోటోకి ఫోజులు ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ గా మారింది. షేర్ చేసిన కొద్దిసేపటికే ఫోటో ని చాలా మంది నెటిజన్లు లైక్ చేశారు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఫోటోలో ఆమె ఇచ్చిన ఫోజులకంటే పక్కనే ఒక వైన్ బాటిల్ కనబడటంతో నెటిజన్లు రెచ్చిపోయారు. 

 

ఆ బాటిల్ ఏంటి.. దాని వెనక కథ ఏంటి.. ఆ బ్రాండ్ ఏంటి.. అది మన ఊర్లో దొరుకుతుందా...ధర ఎంత ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ఫోటోను జూమ్ చెయ్యడంతో వైన్ బ్రాండ్ పేరు 'మెర్లాట్'(MERLOT) అని.. రెడ్ వైన్ కేటగిరీలో ఇదో బ్రాండ్ అని బయటపడింది. క్వాలిటీ ని బట్టి ఈ వైన్ బాటిల్ 10 డాలర్స్ నుంచి 50 డాలర్స్ వరకూ ఉంటుందట. ఇది కాస్ట్లీ బ్రాండ్ ఏమీ కాదు. ఇండియాలో 750 ml బాటిల్ రూ.750 కు లభిస్తుందట. ఇలా ఆ బాటిల్ గురించి వివరాలు అన్ని కనుక్కొని సురేఖ వాణి పై కామెంట్లు మీద కామెంట్లు చేశారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: