సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్క హీరో ఆ దర్శకుడు ఒక్క అవకాశం ఇస్తే బావుండు అని ఎదురుచూసే దర్శకులలో మొదట వినిపించే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పటి వరకూ పరాజయం అంటే తెలియని దర్శకుడు ఈయన. దీనికి కారణం తన సినిమాలో రాజమౌళి కథానాయకుడి ని మలచుకునే తీరు అటువంటిది. ఈ విషయాన్ని రాజమౌళి హిట్ కాంబినేషన్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తెలియజేస్తాయి. స్టూడెంట్ నెం 1 చిత్రం ద్వారా సినీ పరిశ్రమ కు తొలిసారిగా దర్శకుడుగా పరిచయం అయ్యారు రాజమౌళి. 

 

ఎన్టీఆర్ హీరో గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నటుడిగా ఇటు తారక్ కు, డైరెక్టర్ గా రాజమౌళి కి మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసింది. ఒక సంవత్సరం గాప్ తరువాత మళ్ళీ వీరి కాంబినేషన్లో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు, అదే సింహాద్రి. స్టూడెంట్ నేం 1 లో ఎన్టీఆర్ ని సాప్ట్ గా చూపించిన జక్కన సింహాద్రి సినిమా లో ఎన్టీఆర్ లోని పూర్తి స్థాయి నటుడిని ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా వీరికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కొన్నేళ్ల పాటు ఇతర నటుల సినిమాలో బిజీ అయ్యాడు రాజమౌళి. ఎన్టీఆర్ కూడా తరువాత వేరే సినిమాలతో బిజీ అయ్యాడు. 

 

కొన్నాళ్ళు సరైన హిట్స్ లేక నిరాశ చెందిన ఎన్టీఆర్ కు తప్పనిసరి గా హిట్ పడాల్సిందే అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక రేంజ్ హిట్ ను యమదొంగ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు అందించారు రాజమౌళి. అప్పటి వరకు సోషియో ఫాంటసీ నీ మర్చిపోయిన నేటి తరం ప్రేక్షకులకు ఈ సినిమా లో తారక్ ను యముడి పాత్రలో చూపించి, మెప్పించారు జక్కన్న. ఎన్టీఆర్ కూడా జక్కన్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. బహుశా అందుకేనేమో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కి జక్కన అని పిలిచేది. చాలా సందర్భాల్లో కూడా ఎన్టీఆర్ ఇలా అన్నారు. రాజమౌళి తన సినిమాలో హీరోని ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతారు, కాబట్టే నేను ఆయనకు జక్కన్న అని పేరు పెట్టాను అని జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తో తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: