అప్పటి వరకు ఒక మాదిరిగా ఉన్న విజయ్ దేవరకొండ ను సింగిల్ నైట్ స్టార్ నీ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. అప్పటి వరకు విజయ్ దేవరకొండ కొన్ని సినిమాలలో నటించినప్పటికీ కూడా ప్రేక్షకులలో ఆయనకు ఇంత క్రేజ్ రాలేదు. కొత్త దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మొత్తం విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ నే మార్చేసిందని చెప్పాలి. సినిమాల మీద ఆసక్తితో సందీప్ విదేశాలలో ఉద్యోగాన్ని వదులుకుని ఇండియా వచ్చేశారు. ఇంతకు ముందు సినీ పరిశ్రమ లో కొన్ని విభాగాల్లో పని చేసిన అనుభవం సందీప్ కు ఉంది. 

 

2010 లో నాగార్జున హీరో గా చేసిన కేడి కు, 2015 లో శర్వానంద్ హీరోగా నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాలకు సహాయ దర్శకుడు గా సందీప్ వంగ పని చేశారు. అర్జున్ రెడ్డి కి ముందు శర్వానంద్ హీరోగా అనుకున్నారు సందీప్, అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయడం కుదరలేదు. అప్పుడు ఈ అవకాశం విజయ్ దేవరకొండ ను వరించింది. అంది వచ్చిన ఈ అవకాశాన్ని విజయ్ చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ చిత్రంలోని అర్జున్ రెడ్డి పాత్ర కు పూర్తి న్యాయం చేశారు విజయ్ దేవరకొండ. 5 కోట్ల రూపాయల తో నిర్మించిన ఈ చిత్రం 50 కోట్ల పైనే వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. 

 


హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అని అర్జున్ రెడ్డి ని చెప్పవచ్చు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఇచ్చారు దర్శకుడు సందీప్ వంగ. ఈ సినిమా తర్వాత విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పింది ఈ సినిమా. అక్కడి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు విజయ్. అతనితో సినిమా చేయడానికి అగ్ర దర్శకులు సైతం పోటీ పడుతూ ఉంటారు. ఈ మధ్య కాస్త ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. ఏది ఎలా ఉన్నా సరే ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ హిట్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: