టాలీవుడ్ లో దిల్ రాజు కింగ్ మేకర్ లా ఒక వెలుగు వెలుగుతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు దూకుడు సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో అందరికంటే స్పీడ్ గా సినిమాలని నిర్మిస్తూ తిరుగులేని సక్సస్ లను అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా దిల్ రాజు పరిస్థితి అసలు బాగాలేదు. ఏ సినిమా చేసినా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. ఈ స్టార్ ప్రొడ్యూసర్ కే స్టార్స్ కనిపిస్తున్నాయి.

 

ఒక సినిమా సక్సస్ అనుకుంటే రెండు సినిమాలతో ఫ్లాప్స్ ని అందుకుంటున్నాడు. వచ్చిన లాభాలు వచ్చినట్టే తర్వాత సినిమాలతో పోతున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా మీదే ఆశలన్ని పెట్టుకున్నాడు. అందుకే బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ సినిమాని పవర్ స్టార్ తో వకీల్ సాబ్' గా రీమేక్ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ పాత్రకు హీరోయిన్ ను కూడా క్రియోట్ చేశారు.

 

కానీ కొన్ని రోజుల నుండి పవన్ సరసన నటించే ఆ హీరోయిన్ ఎవరైతే బావుంటుంది అన్న విషయంలో దిల్ రాజు బాగా సతమమయ్యాడు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి బడ్జెట్ భారీగా ఖర్చు చేస్తున్నాడు. ఇక హీరోయిన్స్ కి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చే సినిమా లేదు. కియారా అద్వాని అని, శృతి హాసన్ అని, రకుల్ ప్రీత్ సింగ్ అని ...ఇలా రక రకాల పేర్లు తెరమీదకొచ్చాయి.

 

ఒకవేళ కియారా ని గనక తీసుకుంటే భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉండేది. ఎందుకంటే ఈ అమ్మడు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక రకుల్ ఫాం లో లేదు కాబట్టి మైనస్ అవుతుందని లైట్ తీసుకున్నారు. అందుకే అన్నీ ఆలోచించి అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. 

 

 ఈ సినిమా దిల్ రాజు బ్యానర్, అందులోను పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా అనేసరికి లావణ్య త్రిపాఠి ఇది గోల్డెన్ ఛాన్స్ అని ఎగిరి గంతేసింది. ఒకవేళ పవన్ ఎవరైనా టాప్ హీరోయిన్ ను ఫైనలైజ్ చేస్తే వాళ్ళకి రెమ్యూనరేషన్ భారీగా ఇవ్వాల్సి ఉండేది. అయితే పవన్ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళని కాదని లావణ్యకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దిల్ రాజుకి పవన్ కళ్యాణ్ చాలా మేలు చేసినట్టు ఫీలవుతున్నాడట. అంతేకాదు హీరోయిన్ విషయంలో పవన్ కళ్యాణ్ దిల్ రాజు కి చాలా డబ్బు సేవ్ చేశారని దిల్ రాజు హ్యాపీగా ఫీలవుతున్నారట. ప్రస్తుతం లావణ్య సినిమాలు లేక ఖాళీగా ఉంది కాబట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే ఛాన్సే లేదు. అదే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకి దిల్ రాజుకి కలిసొచ్చిన అంశం. ఈ క్రెడిట్ అంతా పవర్ స్టార్ దే. 

మరింత సమాచారం తెలుసుకోండి: