సినిమా ఇండ‌స్ట్రీలో తాగుడు అనేది ఒక ఫ్యాష‌న్ తాగ‌క‌పోతే త‌ప్పుగా అనుకుంటారేమో అన్న‌ట్లు ఉంటుంది వ్య‌వ‌హారం. ఈవెంట్ ఏదైనా వ్య‌వ‌హారం ఏదైనా మందులేనిదే పార్టీ ఉండ‌దు. అయితే చెప్పాలంటే ఇండ‌స్ట్రీలో ఎక్కువ మంది మ‌ద్యం తాగుతార‌నేది టాక్‌. అయితే కొంద‌రు చెప్పుకుంటారు మ‌రి కొంద‌రు దాస్తారు. గ‌తంలో సావిత్రి, సిల్క్‌స్మిత, దివ్య‌భార‌తి లాంటివారు కూడా మ‌ద్యానికి బానిసై జీవితాన్ని ఆయుష్షును పోగొట్టుకున్నారు. ఇక నిన్న‌టి త‌రానికి వ‌స్తే మ‌నీషాకొయిరాలా వంటి హీరోయిన్లు కూడా మ‌ద్యానికి బానిసై క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. కానీ అప్ప‌ట్లో మీడియా కంట ప‌డితే త‌ప్పించి తాగిన విష‌యం బ‌య‌ట ప‌డేది కాదు. కాని ఇప్పుడు అదేం లేదు బాహాటంగానే బ‌య‌ట‌కు చెపుతున్నారు నేటి హీరోయిన్లు. అలా పోటీగా తాగుతూ మీడియా ముఖంగా చెప్పే హీరోయిన్ల గురించి తెలుసుకుందాం...

 

ఇక ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవ‌ల‌సింది మాత్రం శృతిహాస‌న్ గురించే క‌మ‌ల్ హాస‌న్ గారాల‌ప‌ట్టి. త‌న‌కున్న తాగుడు అల‌వాటు గురించి చెపుతూ మ‌ద్యం మాన‌లేక కెరియ‌ర్‌లో  కూడా స‌మ‌స్య‌ల్ని ఎదుర్కున్నాన‌ని చెప్పింది. ఇలా బాహాటంగా శృతిహాస‌న్ త‌న బ‌ల‌హీన‌త‌ను బ‌య‌ట‌పెట్ట‌డం టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయింది. అయితే అప్పుడు తాను మందుకి చాలా దూరంగా ఉన్నాన‌ని ఇక పై మ‌ద్యం జోలికి వెళ్ళ‌న‌ని కూడా చెప్పింది.

 

ఇక మ‌రో హీరోయిన్ వీణ త‌మిళ న‌టి అయిన వీణ త‌ను పోటుగా మ‌ద్యం తాగుతాను అని బ‌ల్ల గుద్ది మ‌రీ చెపుతుంది. ఇటీవ‌లె ఓ మ్యాగ‌జైన్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విష‌యాన్ని బ‌య‌ట పెట్టింది. నాకు తాగుడు అల‌వాటు ఉంద‌న్న విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌డానికి నేనెందుకు భ‌య‌ప‌డాలి అదేమ‌న్నా త‌ప్పా అంటూ ఒక‌వేళ బీర్ తాగితే నేను చాలా మాట్లాడేస్తాను. ఈ విష‌యాన్ని నేను గ‌తంలో కూడా చెప్పాను. ఇది నా అల‌వాటు. నా వ్యాఖ్య‌ల‌ను ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తోంది త‌ప్పోకాదో అంటూ హిత బోద కూడా చేస్తోంది. ప‌టాస్ షోతో పాపుల‌ర్ అయిన యాంక‌ర్ శ్రీ‌ముఖి యాంక‌రింగ్‌తో పాటు ఇటీవ‌ల బిగ్‌బిస్‌లోనూ సంద‌డి చేసి ఇటీవ‌ల యువ‌త‌ను ఎట్రాక్ట్ చెయ్య‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇటీవ‌లె మీడియాతో మాట్లాడిన శ్రీ‌ముఖి మీరు మందుకొడ‌తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు నిజానికి చెప్పాలంటే అకేష‌న్స్ అన్నిటిలోనూ తాగుతాను ఎక్కువ‌గా వైన్ ప్రిఫ‌ర్ చేస్తాను. అదే ఆరోగ్యం కూడా అంటూ నిర్మొహ‌మాటంగా ఒప్పుకుంది శ్రీ‌ముఖి. 

 

బాలీవుడ్‌లో అయితే దాదాపు అంద‌రికీ ఈ అల‌వాటు ఉంటుంది. కానీ బ‌య‌ట‌కు మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌రు. కాని ప‌రిణితి చోప్పా మాత్రం మందు తాగిన‌ప్పుడు జ‌రిగిన సీన్‌తో స‌హా అన్న చెప్పేసింది. సినిమాల్లోకి రాక‌ముందు అల‌వాటు లేదంట అలాగే సినిమాల్లోకి వ‌చ్చాక కూడా 4,5 సినిమాల వ‌ర‌కు ఈ అల‌వాటులేద‌ట‌. ఇప్పుడ‌యితే ప‌రిణితి హ్యాంగ్ అవుట్స్‌లో తాగుతుంద‌ట‌. మొద‌టిసారి మ‌ద్యం తాగిన‌ప్పుడు కంట్రోల్‌లో లేన‌ని రాత్రంతా ముద్దులు కూడా పెట్టాన‌ని డాన్స్ చేశాన‌ని విష‌యాన్ని బ‌య‌ట పెట్టింది. ఇక పూజా భ‌ట్ కూడా నేను మ‌ద్యం సేవిస్తాన‌ని చెప్పింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: