మెగాస్టార్ చిరంజీవి కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా చేసిన దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే పేరు ఎ.కోదండరామిరెడ్డి. ఈ ఇద్దరి ఉద్దండుల కెరీర్ వెనక్కి తిరిగిచూసుకోకుండా చేసిన ఆ సినిమా ఖైదీ. 1983 సెప్టెంబర్ 28న విడుదలైన ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. మూస పద్ధతిలో ఉన్న తెలుగు సినిమాకు ఖైదీ ద్వారా డ్యాన్సుల్లో స్పీడు, ఫైట్స్ లో ఒరిజినాలిటీని చూపించి భవిష్యత్ తెలుగు సినిమాకు మార్గదర్శిగా నిలిచారు మెగాస్టార్.

 

 

 

చిరంజీవిలోని టాలెంట్ ను కోదండరామి రెడ్డి ఆవిష్కరించారా.. లేక కోదండరామిరెడ్డి లోని టేకింగ్ స్పెషాలిటీని చిరంజీవి బయటకు తీసారా అంటే ఏదీ చెప్పలేని పరిస్థితి. వీరిద్దరికీ ల్యాండ్ మార్క్ గా ఖైదీ నిలిచినా.. బిజీ ఆర్టిస్ట్ గా, టెక్నీషియిన్ గా మారినా కలసి సినిమాలు చేయడం మానుకోలేదు. ఏకంగా 23 సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయంటే ఎంత ఫ్రెండ్లీ నేచర్, ఎంత నమ్మకం ఉంటే ఈ కాంబో సాధ్యమవుతుందో ఆలోచించాల్సిందే. మధ్యలో కొన్ని ఫ్లాపులు పలకరించినా హిట్ల శాతమే ఎక్కువ. 1981లో వచ్చిన న్యాయం కావాలి సినిమాతో మొదలైన వీరి కాంబో 1993లో వచ్చిన ముఠామేస్త్రి వరకూ కొనసాగింది. శివుడు శివుడు శివుడు, రుస్తుం, వేట, కిరాతకుడు, వేట, త్రినేత్రుడు తప్ప మిగిలిన 17 సినిమాలన్ని సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.

 

 

 

ఖైదీ, పసివాడి ప్రాణం, అత్తకుయముడు అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్లయ్యాయి. పసివాడి ప్రాణంలోనే చిరంజీవి మొదిటిసారిగా బ్రేక్ డ్యాన్సులను పరిచయం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే కోదండరామిరెడ్డి కెరీర్లో వేట సినిమా తీసినంత టెక్నిక్, టేకింగ్ మరే సినిమాలో తీయలేదంటారు. అటు కోదండరామిరెడ్డికి కూడా తన కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో చిరంజీవే కావడం విశేషం.

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: