సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇండియన్ 2. ఇతని కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన భారతీయుడు సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఇటీవల భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద క్రేన్ సినిమా షూటింగ్ జరుగుతున్న టైములో పడిపోవడంతో సినిమా యూనిట్ కి చెందిన ముగ్గురు చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో కొంత మంది గాయాలపాలయ్యారు. ఈ సినిమా నిర్మాణ సంస్థపై అలాగే పలువురిపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు కేసు విచారణలో భాగంగా డైరెక్టర్ శంకర్ మరియు హీరోయిన్ అదేవిధంగా హీరో కమల్ హాసన్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపిన పోలీసులు మళ్లీ పదేపదే విచారణకు సినిమా యూనిట్ కు చెందిన వాళ్లని రమ్మని ఇబ్బంది పెట్టడంతో ఈ విషయం తమిళ సినిమా రంగంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

దీంతో ఎంతో సీరియస్ అయిన కమలహాసన్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హైకోర్టులో చేసినట్లు తమిళ సినిమా రంగంలో వార్తలు వస్తున్నాయి. కావాలని పోలీసులు సినిమా యూనిట్ కు చెందిన వాళ్లని ముఖ్యంగా తనని వేధిస్తున్నారని ఎటువంటి విచారణ లేకపోయినా పదేపదే పోలీస్ స్టేషన్ కి పిలుస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అదేవిధంగా వేధిస్తున్నారు అంటూ హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినా పదే పదే విచారణ అంటూ విసిగిస్తున్నారని కమల్‌ కోర్టుకు తెలియజేశాడు. తాను ఒక సెలబ్రెటీ అవ్వడం వల్ల కేసు విచారణకు పదే పదే హాజరు అవ్వడం సాధ్యం కావడం లేదని.. కొద్ది సమయం విచారణ కోసం నన్ను పిలవడం వల్ల అన్ని విధాలుగా నష్టాలు అంటూ కమల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

దీంతో కోర్టు ఇరువర్గాల వాదనలు వినటానికి రెడీ అయ్యింది. ఇటువంటి తరుణంలో కావాలని కమల్ హాసన్ ని వేధించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పోలీసులను ఊసి గొలుపుతున్నాయి అని కొంతమంది ఈ వార్తపై కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కమలహాసన్ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో రాబోయే తమిళ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో ఈ కేసును అడ్డంపెట్టుకుని కమలహాసన్ ని కట్టడి చేయడానికి కొన్ని పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాలు అంటూ కమలహాసన్ కి సపోర్ట్ గా కొంతమంది సోషల్ మీడియాలో ఈ కేసుపై స్పందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: