ఎంత స్టార్ హీరో అయినా.. ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సెంటిమెంట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇక అలాంటి సెంటిమెంట్లల్లో మహేష్ బాబు సెంటిమెంట్లు మరి ఘోరం. ఏంటి ? ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా... మహేష్ బాబు.. సినీ కెరీర్ లో ఎన్నో రికార్డులు సాధించిన సినిమాలు ఉన్నాయి.. అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి.. కనీసం అంటే కనీసం యావరేజ్ టాక్ అందుకొని సినిమాలు కూడా ఉన్నాయి అంటే నమ్మండి. 

 

ఇంకా ఇప్పుడు మహేష్ బాబు ఓ సెంటిమెంట్ ప్రేక్షకులను కలవరపెడుతుంది. అది ఏంటి అంటే? మహేష్ బాబుకు ఎవరైనా దర్శకుడు బాగా నచ్చడు అంటే ఆ దర్శకుడికి వరుసగా అవకాశాలు ఇచ్చేస్తాడు మహేష్ బాబు. అలా అవకాశాలు ఇచ్చి చాలా సార్లు ఎదురు దెబ్బలు తిన్నాడు మహేష్ బాబు. అయినా సరే మహేష్ బాబు ఆ అలవాటును మాత్రం మానుకోలేదు.. 

 

సాధారణంగా.. ఈ హీరోకు అయినా ఒకసారి హిట్ వచ్చింది అంటే.. ఆ హీరోలు వాళ్ళతో మళ్లీ సినిమా చేసి ఎలా అయినా సరే మళ్లీ హిట్ కొట్టాలి అనుకుంటారు. అలానే మహేష్ కూడా. కానీ మహేష్ బాబుకు ఆ సెంటిమెంట్ కారణంగా ఎవరు హిట్ కొట్టలేకపోతున్నారు. మహేష్ రెండో అవకాశం ఇచ్చిన దర్శకులు అంతా...ఆ చాన్స్ ని ఉపయోగించుకోలేకపోయారు. మహేష్ కు ఫ్లపులే మిగిల్చారు. 

 

గుణశేఖర్ కు వరుసగా రెండు అవకాశాలు ఇచ్చాడు.. ఒక్కడు సినిమా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి రెండు సార్లు అవకాశం ఇచ్చాడు..  కానీ ఆ రెండు ఛాన్సులు వేస్ట్ ఏ అయ్యాయి. అర్జున్, సైనికుడు రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంకా శ్రీను వైట్ల విషయంలో కూడా అదే జరిగింది.. దూకుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆగడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

 

అంత ఎందుకు అండి.. త్రివిక్రమ్ తో కలిసి అతడు సినిమా చేశాడు.. ఆ సినిమా ఇప్పటికి.. ఎప్పటికి సూపర్ హిట్టే. కానీ ఖలేజా సినిమా ప్లాప్. నిజానికి ఆ సినిమా ప్లాప్ అయినా సరే మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఇంకా ఆతర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ ఫ్యామిలీ హిట్ గా ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకి ఛాన్స్ ఇవ్వగా బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్ కెరీర్ లో ఓ వరస్ట్ సినిమాగా మిగిల్చాడు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

 

అయితే ఈ లిస్ట్ నుండి.. పూరి జగన్నాథ్ ను.. కొరటాల శివను తీసేయాలి.. ఎందుకంటే పూరితో కలిసి పోకిరి చేసిన మహేష్ బాబు ఆతర్వాత బిజినెస్ మేన్ సినిమా చేసి మరో హిట్ ఇచ్ఛడు. అచ్చం అలానే మహేష్ బాబుతో కొరటాల శివతో శ్రీమంతుడు చెయ్యగా.. ఆతరవాత అవకాశం ఇచ్చి భారత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అయినప్పటికీ దర్శకులకు భయం వేస్తుంది.. ఈ మహేష్ బాబుతో రెండోసారి సినిమా చేస్తే ఎక్కడ అట్టర్ ప్లాప్ అవుతుందో అని.. అందుకే మెల్లగా స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా దూరం అవుతున్నారు అని టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: