సుధీర్ బాబు సినిమా నన్ను దోచుకుందువటేతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ నాభా నటేష్. ఆ సినిమాతో పర్వాలేదు అనిపించగా ఆ తర్వాత పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ శంకర్ సినిమాతో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు మాస్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుండి నభాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. రవితేజ డిస్కో రాజాతో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం బెల్లంకొండ బాబు అల్లుడు అదుర్స్ సినిమాతో పాటుగా సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో కూడా నటిస్తుంది. 

 

ఓ పక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క ఆడియెన్స్ ను తన బుట్టలో వేసుకునేందుకు ఫోటో షూట్ కూడా చేస్తుంది నభా నటేష్. లేటెస్ట్ గా అలాంటి ఓ క్రేజీ ఫోటో షూట్ లోని పిక్స్ కొన్ని రివీల్ చేసింది అమ్మడు. వాటిని చూసి కుర్రాళ్ల హృదయాలు గిలిగింతలు పెట్టడం గ్యారెంటీ. అందమైన కుందనాల బొమ్మరా అంటూ సంపంగి సినిమాలో హీరో దీపక్ పాడినట్టుగా అమ్మడి అందం గురించి పాడాల్సి వస్తుంది. 

 

తెలుగులో హెరొఇనెస్ కొరత ఉండటం.. కరెక్ట్ టైం లో అటు అందంతో అభినయంతో మెప్పించే నభా ఎంట్రీ ఇవ్వడం అన్ని బాగా కలిసి వచ్చాయి. అందుకే అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం యువ హీరోలతో జోడి కడుతున్న నభా నటేష్ త్వరలోనే స్టార్ ఛాన్సులు అందుకోవాలని ఆశిద్దాం. స్టార్ సినిమాల్లో నటించడం మొదలు పెడితే మాత్రం అమ్మడి ఫేట్ మారిపోయినట్టే అవుతుంది. నభా నటేష్ తాను కమిటైన సినిమాకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసేలా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. అందుకే ఆమెకు  ఆఫర్లు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: