అదృష్టాన్ని అందరు నమ్ముతారు.. కానీ ఆ అదృష్టంతో పాటుగా శ్రమను మాత్రం కొందరే నమ్ముతారు..ఇలా నమ్మిన వారే ప్రపంచ విజేతలుగా నిలిచిపోతారు.. ఆలా నిలిచే వారిలో రజనీకాంత్ ఒకరని చెప్ప వచ్చూ.. మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ అన్నారు ప్రముఖ కవి ఒకరు.. ఇది  అక్షర సత్యం..

 

 

ఎందుకంటే.. ఆ నాటి ఒక బస్సు కండక్టర్ తనకంటు ఒక సినిమా ప్రపంచాన్నే స్దాపించుకున్నాడు.. అందులో అభిమానులను భాగస్వాములను చేసి నిరాడంభరంగా జీవిస్తున్నాడు.. అంత పెద్ద హోదా ఉన్నా ఒక సాధారణ వ్యక్తిగా ప్రజలతో కలుపుకుని ఉండటం ఆయన తన ఒంట బట్టించుకున్నాడు.. అప్పటికి ఇప్పటికి తరాలు మారుతున్నా ఈ రోజుకీ ఆయనే సంచలన కథానాయకుడని నిరూపించింది.. ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ అసలు పేరు.. శివాజీ రావు గైక్వాడ్. 1950 డిసెంబర్ 12 న జన్మించిన ఈయన తన 25 వ ఏటనే సినీరంగ ప్రవేశం చేసారు..

 

 

మొట్టమొదటగా ముఖానికి రంగు చేసుకున్నది 1975 లో అపూర్వ రాగంగళ్ అనే తమిళ చిత్రంతో.. ఈ సినిమా ద్వారానే సినీరంగ ప్రవేశం చేశారు.. ఇక అప్పటికే బస్సు కండక్టర్ గా పనిచేస్తోన్న రజనీకాంత్, దర్శకుడు బాలచందర్ కంటపడటం, ఆయనలోని ప్రత్యేకతను గుర్తించిన బాలచందర్ తాను దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం.. అంతులేని కథలో.. పనీ పాటాలేకుండా చెల్లి సంపాదనపై ఆధారపడిన జులాయి అన్నగా రజనీని నటింపచేయగా, తన అద్భుతమైన నటనతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక రజనీ సినిమాలో ఆయన కనబరిచే స్టైల్‌కు ఫిదాకాని అభిమాని ఉండడు..

 

 

ఒకగానొక దశలో ఆయన స్టైల్‌ను చూడడానికే అభిమానులు ధియోటర్స్‌కు వెళ్లే వారు.. ఇక రజనీ సినిమా సినిమాకి తన స్టైల్ కి మెరుగులు దిద్దుతూ వచ్చారు. తన మాటతీరు, నడక నటన విషయంలో ఆయన ఆవిష్కరించిన వైవిధ్యానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. దాంతో ఆయన బహుభాషా కథానాయకుడిగా మరింత బిజీ అయ్యారు. ఇదే కాకుండా విదేశీయులకు కూడా తన నటన రుచి చూపించి అక్కడ కూడ సక్సెస్ అయ్యాడు.. ఇలా ఎంత ఎదిగిన ఒదిగుండాలనే ఆయన మనస్తత్వం ఆయనపై మరింత అభిమానాన్ని పెంచాయి.. ఇక విశిష్టమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా జీవిస్తున్న రజనీ కాంత్.. నిజ జీవితంలో విజేత అని చెప్పవచ్చు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: