పవన్ కళ్యాణ్... ఈ పేరే ఓ సంచ‌ల‌నంగా ఫీల్ అవుతుంటారు ఆయ‌న అభిమానులు. రాజకీయాల్లో ఎంత వ‌ర‌కు సంచలనం సృష్టించారో ప‌క్క‌న పెడితే.. సినిమాల్లో మాత్రం ఏ రేంజ్‌లోనే రికార్డులు క్రియేట్ చేశారు. అన్నమెగాస్టార్ చిరంజీవి అండతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే  తనదైన ముద్రతో ప్రేక్షకులలో గుర్తింపు  తెచ్చుకున్నారు. 1996లో ఆయన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వెలువడిన ఆ సినిమా అంత‌గా ఆక‌ట్టులేక‌పోయింది. ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రాన్ని ఎప్పటికి మరిచిపోలేం.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లవ్ ఎంటర్టైనర్ తొలిప్రేమ లవ్ స్టోరీ మూవీస్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ చిత్రం కల్ట్ సినిమా గా మిగిలిపోయింది. అంతేకాకుండా ఓవర్ నైట్ లో పవన్ ను స్టార్ హీరో ను చేసింది కూడా ఈ చిత్రం.  ఎ. కరుణాకరన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు మొద‌టి బ్రేక్‌ను అందించింది.  1998 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఎన్ని సార్లు టీవీ ల్లో వచ్చిన అదిరిపోయే రేటింగ్స్ వస్తాయి. ఎస్ఎస్ సి ఆర్ట్స్ పతాకం ఫై జి వి జి రాజు నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా న‌టించింది.

 

అప్పట్లో ఈ చిత్రం యొక్క ఆడియో కూడా ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టించింది. సిస్టర్ సెంటిమెంట్, లవ్, ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్, ఫ్యామిలీ అన్ని సమపాళ్లలో కుదిరిన తొలిప్రేమ లాంటి మాస్టర్ పీస్ కరుణాకరణే మళ్ళి తీయలేకపోయాడు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే..  ఓ మోస్తరు అంచనాలతో దర్శకుడు కరుణాకరన్ డెబ్యూ మూవీగా విడుదలైన ఈ ఎపిక్ లవ్ స్టొరీ 200 రోజులు పైగా సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. కలెక్షన్లు లెక్కేసి ట్రేడ్ అలిసిపోయేలా కూడా చేసింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రం త‌ర్వాత‌ గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషివంటి వరుస హిట్ చిత్రాలతో అగ్రనటుడిగా మారారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: