ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న సినిమాలు చెయ్యాలి అంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరు అయినా. ఆయనతో అలాంటి సినిమా తీయాలి అనుకున్న దర్శకులకు ఆయన నుంచి అన్ని కోణాలు దొరుకుతూ ఉంటాయి. బాలకృష్ణ అలాంటి సినిమాలను ప్రాణం పెట్టి తీస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన చేసిన కొన్ని సినిమాలు నిజంగా ఫ్యాక్షన్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఉంటాయి. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన రెండు సినిమాల్లో ఒక సినిమా ఫ్యాక్షన్ మరో సినిమా రౌడీ యుజం తో ముడిపడి ఉంటుంది. 

 

సింహా సినిమా ఫ్యాక్షన్ కి దగ్గరగా ఉంటుంది. ఇక లెజెండ్ సినిమాలో ఎక్కువగా పొలిటికల్ రౌడీ యుజం చూపిస్తూ ఉంటారు. బాలకృష్ణ ను ఏ విధంగా చూపిస్తే ఆయన ఫాన్స్ కి నచ్చుతుందో బోయపాటి శ్రీను ఆ విధంగా చూపిస్తూ ఉంటారు అనేది వాస్తవం. ముఖ్యంగా రెండు సినిమాల్లో బాలకృష్ణ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ విధంగా ఆ సినిమాలు బాలయ్య ఫాన్స్ కి బాగా దగ్గరయ్యాయి అనేది వాస్తవం. బాలకృష్ణ కూడా ఆ సినిమాలను చాలా జాగ్రత్తగా చేసారు. సింహా సినిమా డాక్టర్ గా ఆయన పోరాటం చేస్తే, 

 

లెజెండ్ సినిమాలో రాజకీయ నాయకుడిగా నటించారు. ఈ రెండు సినిమాలు బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. బాలయ్యను ఇలా చూపిస్తేనే ఆయన ప్రేక్షకులకు నచ్చుతుంది అని గ్రహించిన బోయపాటి అలాగే ఆయన్ను చూపించారు. అందుకే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు అదో పండుగ. ముఖ్యంగా నందమూరి ప్రేక్షకులకు అయితే ఒక పిచ్చి. ఆ విధంగా ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో బెస్ట్ కాంబో అనిపించుకుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: