క్రేజీ స్టార్ రౌడీ హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌కి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవ‌త్స‌రం కూడా  మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను హైదరాబాద్ టైమ్స్ ప్రకటిస్తూనే ఉంది. అయితే తాజాగా మరొకసారి 2019 సంత్సరానికి హైదరాబాద్ టైమ్స్ 30 మందితో కూడిన తాజా జాబితాను  విడుద‌ల చేసింది. అయితే గతేడాది లాగానే ఈ సారి కూడా మన క్రేజ్రీ స్టార్ విజయ్ దేవరకొండ మళ్ళీ తొలిస్థానంలోనే నిలవడం అనేది చాలా గ‌ర్వ‌ప‌డాల్సిన విష‌యం అని చెప్పాలి.

 

ఇక ఈ క్రేజీ స్టార్ స్టైల్‌గాని, మాట‌లుగాని ఆయ‌న బాడీ లాంగ్వేజ్‌గాని చాలా కొత్త‌గా ఉంటాయి. నేటి యూత్ మొత్తం ఆయ‌న స్టైల్‌కి ఫిదా అవుతున్నారు. అంతేకాక ఆయ‌న స్టైల్స్‌ని..మేన‌రిజ‌మ్స్‌ని ఫాలోఅవుతున్నారు. అతి త‌క్కువ కాలంలోనే మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. 2019 సంవత్సరానికి గాను తొలి స్థానం దక్కిందని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఇకపోతే విజయ్ తరువాత రెండవ స్థానంలో రామ్ చరణ్, రామ్, ప్రభాస్, ఎన్టీఆర్, సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్ ఇలా వరుసగా తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే మ‌రి ఎప్ప‌టి నుంచో స్టైల్‌ని క్రేజ్‌ని మెయింటెయిన్ చేస్తున్న హీరోల‌ను సైతం పక్క‌కు నెట్టి విజ‌య్‌దేవ‌ర‌కొండ మొద‌టి స్థానంలో నిల‌వ‌డ‌మ‌నేది మాములు విష‌యం కాదు. అందులో త‌ను మాట్లాడే మాట తీరు కూడా కాస్త తెలంగాణ స్లాంగ్ కలిసి కొంచం ర‌ఫ్‌నెస్‌గా ఉండ‌డం వ‌ల్ల యూత్‌ను ఆక‌ర్షిస్తోందో ఏమో తెలియ‌దు కాని వియ‌జ్‌కి సినిమాలు పెద్ద‌గా హిట్ కావ‌డం లేదుగాని ఈ జాబితాలో మాత్రం ముందు వ‌రుస‌లో నిల్చున్నాడు. ఏది ఏమైనప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆయ‌న పూరి ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ చిత్రాన్ని చేస్తున్నారు. క‌నీసం అద‌న్నా హిట్ కొడితే బావుంటుంద‌ని రౌడీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: